వరుస సినిమాల వెనుక డీల్ ఏమైనా ఉందా..?

ఓ హీరో, ఓ డైరెక్టర్ కాంబినేషన్ లో గ్యాప్ లేకుండా.. వరుసగా రెండు సినిమాలు రావడం అరుదుగా జరుగుతుంటుంది. అలాంటిది ఏకంగా మూడు సినిమాలు వస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. యంగ్ హీరో రాజ్ తరుణ్.. దర్శకుడు విజయ్ కుమార్ కొండా రూపొందించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాలో నటించాడు. ఈ సినిమా మోస్తరు ఫలితాన్ని అందుకుంది. అయితే ఊహించని విధంగా వెంటనే ఈ హీరో, డైరెక్టర్ కలిసి ‘పవర్ ప్లే’ అనే సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకోవడం విశేషం.

రీసెంట్ గా ట్రైలర్ కూడా విడుదల చేశారు. త్వరలోనే సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి మూడో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చేతిలో ‘డ్రీమ్ గాళ్’ అనే రీమేక్ సబ్జెక్ట్ రెడీగా ఉంది. బాలీవుడ్ లో సక్సెస్ అయిన ఈ సినిమాను తెలుగులో రాజ్ తరుణ్ హీరోగా రీమేక్ చేయాలనుకున్నాడు సురేష్ బాబు. అయితే దర్శకుడు మాత్రం దొరకడం లేదు. ఇప్పుడు విజయ్ కుమార్ కొండాతోనే ఈ రీమేక్ చేయాలని భావిస్తున్నాడు సురేష్ బాబు.

‘ఒరేయ్ బుజ్జిగా’, ‘పవర్ ప్లే’ రెండు సినిమాలు కూడా తక్కువ సమయంలో, అనుకున్న బడ్జెట్ లో తీశాడు దర్శకుడు విజయ్ కుమార్. పైగా హీరోకి, డైరెక్టర్ కి మంచి అండర్ స్టాండింగ్ కుదిరింది. అందుకే వరుసగా.. మూడో సినిమా కూడా వారి కాంబినేషన్ లోనే చేయాలని ఫిక్స్ అయ్యాడు సురేష్ బాబు. ఇలా వరుసగా గ్యాప్ లేకుండా మూడు సినిమాలు చేసిన హీరో, డైరెక్టర్ వీరేనేమో. ప్రస్తుతం రాజ్ తరుణ్.. దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి రూపొందిస్తోన్న ఓ సినిమాలో నటిస్తున్నాడు.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus