రాజ్ తరుణ్ క్రైమ్ కామెడీ చిత్రం..!

ఇటీవలే విడుదలైన ‘ఈడోరకం ఆడోరకం’ చిత్రంతో మాంచి విజయం సొంతం చేసుకొన్న రాజ్ తరుణ్, ఇటీవల తన ఓవర్ ఇన్వాల్వ్ మెంట్ కారణంగా పలు ప్రోజెక్టుల నుంచి తప్పించబడడం తెలిసిందే. అయితే.. ఆ ఎఫెక్ట్ మనోడిపై పెద్దగా పనిచేయలేదనిపిస్తోంది.
చేజారిన సినిమా గురించి పట్టించుకోవడం మానేసి.. కొత్త సినిమాలకు సైన్ చేయడంలో బిజీ అయిపోయాడు ఈ కుర్ర హీరో. ఇప్పటివరకూ మాస్ ఎంటర్ టైనర్స్ లో నటిస్తూ వచ్చిన రాజ్ తరుణ్ ఈ సారి క్రైమ్ కామెడీ జానర్ లో నటించనున్నట్లు సమాచారం.

ఈ చిత్రానికి “దొంగాట” ఫేమ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహించనున్నాడు. ‘ఈడోరకం ఆడోరకం ‘ చిత్రీకరణ సమయంలో రాజ్ తరుణ్ ను కలిసిన వంశీ ఓ కథ చెప్పగా ఇందులో నటించడానికి.. రాజ్ అంగీకరించాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ దాదాపు అయిపోయిందని, డైలాగ్ వర్షన్ ప్రస్తుతం సిద్దం చేస్తున్నట్లు సమాచారం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus