Raja Ravindra: చిరంజీవి ఆ సినిమా తీయడం నాకు నచ్చలేదు.. నిర్మాత కారులోకి తీసుకెళ్లి మరీ నన్ను తెగ తిట్టారు: రాజా రవీంద్ర

సీనియర్ నటుడు రాజా రవీంద్ర అందరికీ సుపరిచితమే. చాలా మంది హీరోలకు ఆయన మేనేజర్ గా చేస్తూనే.. మరోపక్క సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు చిరంజీవికి మొత్తం రాజారవీంద్ర అనే సంగతి చాలా మందికి తెలీదు. ఇతన్ని నమ్మినంతలా చిరు మరెవ్వరినీ నమ్మరు అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. వీళ్ళ మధ్య బాండింగ్ కూడా ఓ గొడవ వల్ల ఏర్పడిందట. అది రాజారవీంద్ర ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Raja Ravindra

రాజా రవీంద్ర మాట్లాడుతూ.. ” కె.ఎస్.రవికుమార్ గారు నన్ను తమిళంలో ఇంట్రడ్యూస్ చేశారు. నేను అక్కడ చేసిన మొదటి 5 సినిమాలకు ఆయనే దర్శకుడు. తర్వాత ఆయన తెలుగులో ‘స్నేహం కోసం’ సినిమా షూటింగ్ కోసమని హైదరాబాద్..కి వచ్చినప్పుడు నాకు ఫోన్ చేశారు కె.ఎస్.రవికుమార్. నేను చిరంజీవి గారితో సినిమా చేస్తున్నాను. ‘ఒకసారి లొకేషన్ కి రా..నాకు ఇక్కడ ఎవ్వరూ తెలీదు. ఇబ్బందిగా ఉంది’ అంటే వెళ్లాను. ‘స్నేహం కోసం’ తమిళ్ వెర్షన్ కూడా రవికుమార్ డైరెక్ట్ చేశారు. ‘ఆ సినిమా చూశావా?’ అని అడిగారు.

నేను చూడలేదు అని చెబితే.. డీవీడీ ఇచ్చారు చూడమని. నా దగ్గర డీవీడీ ప్లేయర్ లేదు అంటే ఆయనే ఇచ్చి మరీ చూడమన్నారు. సినిమా చూసిన తర్వాత నేను రవికుమార్ గారిని తిట్టాను. ‘ఈ సినిమా చిరంజీవి గారు చేయడం ఏంటి. తమిళంలో రజినీకాంత్ గారు ఎలాగో, ఇక్కడ చిరంజీవి గారు అలా..! అక్కడ శరత్ కుమార్ చేసిన సినిమాని తీసుకొచ్చి చిరంజీవి గారితో చేయడం కరెక్ట్ కాదు. అసలు వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్నాను. విజయ్ కుమార్ గారు తమిళంలో పెద్ద స్టార్.

తెలుగులో కాదు. ఆయన దగ్గర చిరంజీవి గారు చేతులు కట్టుకుని నిలబడటం అనేది నాకు నచ్చలేదు. పైగా చిరంజీవి గారి కొడుకు కూడా అలాగే చేతులు కట్టుకుని నిలబడటం బాలేదు.’ అని చెప్పాను. ఇది చిరంజీవి గారికి చెప్పినట్టు ఉన్నారు రవి కుమార్. లంచ్ టైంలో చిరంజీవి గారు నన్ను పిలిచారు. ‘ఏమన్నావ్ నువ్వు డైరెక్టర్ తో అని నిలదీశారు. తర్వాత నిర్మాత ఏ,ఎం.రత్నం గారి కారులోకి తీసుకెళ్లి.. ‘ఇదేమైనా భీమవరం అనుకుంటున్నావా? వాళ్ళు కోట్లు పెట్టి సినిమా చేస్తున్నారు’ అని నాకు క్లాస్ పీకారు.

దీంతో నేను ఇక్కడే(తెలుగు ఇండస్ట్రీలో) ఉండాలి. నీ సినిమా చూసి నా ఒపీనియన్ చెప్పినందుకు నాకు బాగా పెట్టావ్ అన్నాను. నన్ను వదిలేయ్ నేను రాను అన్నాను. తర్వాత చిరంజీవి గారు ఫోన్ చేసి రమ్మన్నారు. సినిమా రిలీజ్ అయ్యాక రవి కుమార్ వెళ్లిపోయారు. నేను మాత్రం చిరంజీవి గారి దగ్గరే ఉండిపోయాను” అంటూ చెప్పుకొచ్చారు.

బుచ్చిబాబు కూడా కొరటాల చేసిన తప్పే చేస్తున్నాడా?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus