‘రాజా ది గ్రేట్’ సినిమా రిలీజ్ ని ఫిక్స్ చేసిన రవితేజ

మాస్ మహారాజ్ రవితేజ 2016లో ఏ సినిమా చేయలేదు. ఈ ఏడాది అతని నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. నూతన దర్శకుడు విక్రమ్ సిరికొండతో “టచ్ చేసి చూడు” సినిమా చేస్తున్నారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్న ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీనితో పాటు మరో మూవీని పట్టాలెక్కించారు. పటాస్’, ‘సుప్రీమ్’ విజయాలతో దర్శకుడిగా నిరూపించుకున్న అనిల్ రావిపూడి తో సినిమా చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి  ‘రాజా ది గ్రేట్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో రవితేజ అంధుడిగా నటిస్తున్నప్పటికీ సినిమా ఆద్యంతం నవ్వులు పూయిస్తుందని సమాచారం.

తాజాగా ఈ చిత్రానికి సంబంధిన న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. “టచ్ చేసి చూడు” కంటే ముందే ‘రాజా ది గ్రేట్’ షూటింగ్ పూర్తి అయ్యేలా ఉందని తెలిసింది. అందుకే ఈ చిత్రాన్ని ముందుగా థియేటర్లోకి తీసుకురానున్నారు. సెప్టెంబర్ లోనే రిలీజ్ చేయమని రవితేజ చెప్పినట్లు సమాచారం. అప్పుడు ఎన్టీఆర్, బాలకృష్ణ, మహేష్ బాబు సినిమాలున్నప్పటికీ తన సినిమా మీద ఉన్న నమ్మకంతో విడుదల చేయమని చెప్పారంట. సో ఆ పనిలోనే చిత్ర బృందం ఉంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus