Rajadhani Files: అమరావతి రైతుల సినిమా మధ్యలోనే ఆపేశారు… ప్రేక్షకుల ఆగ్రహం!

  • February 15, 2024 / 07:27 PM IST

రాజకీయ నేపథ్యంలో, ఇతివృత్తంలో వచ్చే సినిమాలతో రిస్క్‌ ఉంటుంది. అవి ఎవరిని ఉద్దేశించి తెరకెక్కించారో వారికి బాగా కనెక్ట్‌ అవుతాయి. అయితే సినిమా న్యాయపరమైన రిస్క్‌లు చాలానే ఉంటాయి. తెలుగులో సినిమాలు – రాజకీయాలు వేర్వేరు అని మనం చెప్పలేం. ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఈ రెండూ కలసి నడుస్తున్నాయి. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వెళ్తుంటారు. రాజకీయాల్లోని వాళ్లు సినిమా వాళ్లకు దగ్గరగా మెలుగుతుంటారు. అయితే, ప్రస్తుతం టాలీవుడ్‌లో రాజకీయ సినిమా వేడి నడుస్తోంది.

మొన్నటికి మొన్న ‘వ్యూహం’ సినిమాల పంచాయతి తేలింది. ఇప్పుడు మరో పంచాయితి మొదలైంది. అయితే ఇది ‘వ్యూహం’కు పూర్తి ఆపోజిట్‌ సినిమా అని చెప్పాలి. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం గురించి, అక్కడ ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఇబ్బందికర పనుల గురించి చర్చించే సినిమా ఇది. ఈ సినిమా ఫిబ్రవరి 15న విడుదలైంది. అలా అనేకంటే సగమే విడుదలైంది అని చెప్పొచ్చు. ఎందుకంటే సగం షో పూర్తవ్వకుండానే ఆపేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాల ఆధారంగా చేసుకుని తీసిన సినిమాలు వివాదంలో చిక్కుకుంటున్నాయి.

‘రాజధాని ఫైల్స్’ సినిమాను ఆపాలని వైసీపీ నాయకుడు ఒకరు వేసిన పిటిషన్‌కు స్పందించిన హైకోర్టు తదుపరి తీర్పు ఇచ్చే వరకు షోలు రద్దు చేయాలని స్టే ఆర్డర్ ఇచ్చింది. దీంతో ఏపీలో ఆఘమేఘాల మీద సినిమా స్క్రీనింగ్ జరుగుతుండగానే అధికారులు వచ్చి సినిమా ఆపేసి… ప్రేక్షకులను బయటకు పంపేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకే ఇలా చేస్తున్నామని చెప్పారు. అయితే తెలంగాణలో ‘రాజధాని ఫైల్స్’ ప్రదర్శనలు కొనసాగించారు. మూడు రాజధానుల అంశంతో పాటు అధికార పార్టీని అవమానించేలా సినిమా తీశారని పిటిషన్‌లో పేర్కొనడం గమనార్హం.

విజయవాడలోని ట్రెండ్‌సెట్‌ మాల్‌, గుంటూరు జిల్లా ఉండవల్లి, ప్రకాశం జిల్లా ఒంగోలులో చిత్ర ప్రదర్శన ఆపేసినట్లు సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. అయితే మరి ఈ ఆదేశాలు తెలంగాణకు ఎందుకు వర్తించడం లేదో తెలియాల్సి ఉంది. అలాగే టికెట్ కొని సినిమాకొచ్చిన తమకు సగంలో సినిమా ఆపేస్తే కలిగే నష్టం సంగతి ఏంటి అని ప్రేక్షకులు అడుగుతున్నారు.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus