కొన్నిసార్లు నాగవంశీని చూస్తే ఈయన చాలా ధైర్యవంతుడు అనిపిస్తుంది. ఎందుకంటే టాలీవుడ్‌లో ఎవరూ టచ్ చేయని అంశాలను మాట్లాడుతూ ఇండస్ట్రీలోని బ్లాక్‌స్పాట్స్, డార్క్ షేడ్స్‌ని బయటి ప్రపంచానికి చూపించారు. ఇది నాణానికి ఒక వైపు. మరోవైపు ఏదేదో మాట్లాడి, అసందర్భంగా ఎక్స్‌లో పోస్ట్‌లు చేసి ట్రోల్ అవుతుంటారు. ఆ పోస్టులు, వాటి టైమింగ్‌లు చూస్తే కచ్చితంగా ఆయన ట్రోలింగ్ అర్హులే అని అర్థమవుతుంది. రీసెంట్‌గా ‘మాస్ జాతర’ సినిమా విషయంలోనూ ఇదే చేసి ట్రోల్ అవుతున్నారు.
మొన్నీమధ్య ‘నన్ను బాగా మిస్ అవుతున్నట్టు ఉన్నారు..’ అంటూ నెటిజన్లను, టాలీవుడ్ ఫ్యాన్స్‌ని టీజ్ చేశారు యువ నిర్మాత నాగవంశీ. ‘వార్ 2’ సినిమా విడుదల వరకు చాలా యాక్టివ్‌గా కనిపించిన ఆయన.. ఆ తర్వాత కనిపించలేదు. దీంతో అప్పటివరకు ఆయన అందరి మీద సెటైర్లు వేస్తే.. ఆయన మీద అందరూ సెటైర్లు వేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మరోసారి ఆయన ట్వీట్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. కారణం ఆయన తన సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయింది అని ఆయన చేసిన ఎక్స్ పోస్టే.
నిజానికి నాగవంశీ పోస్టులో రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేవు, ఏదో ట్రోలింగ్ ఎలిమెంటూ లేదు, ఇతర హీరోలను ఏమీ అనలేదు. ఫ్యాన్స్‌ని కూడా ఏమీ అనలేదు. అయితే 27న రిలీజ్ అవ్వాల్సిన సినిమా పోస్ట్ పోన్ అయింది అంటూ 26న పోస్ట్ పెట్టడమే దానికి కారణం. ఆ పోస్టు చూసి ‘ఈ రోజు ఎందుకు ఓ రెండు రోజులు ఆగాక పెట్టొచ్చు కదా’ లాంటి కామెంట్లు కనిపిస్తున్నాయి. సినిమా రాదు అనే విషయం అందరికీ తెలిశాక ఈ ఫార్మల్ పోస్టులు ఎందుకు ‘ట్రోలింగ్ అంత నచ్చిందా?’ అనే కామెంట్లూ కనిపిస్తున్నాయి.
వాళ్ల కామెంట్ల సంగతేమో కానీ.. ఇలా ఏదేదో కామెంట్లు అనిపించుకుని, ట్రోలింగ్ చేయించుకుంటే కానీ నాగవంశీకి సంతృప్తి ఉండదేమో. ఇది ఆయనను విమర్శిస్తూ కాదు.. టైమింగ్, రైమింగ్ విషయంలో జాగ్రత్తగా ఉంటే ట్రోల్స్ తప్పుతాయి అనే సూచన మాత్రమే.