రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలలో ఈగ ఒకటనే సంగతి తెలిసిందే. నాని, సమంత, కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలై పదేళ్లైనా ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను సులువుగా మరిచిపోలేరు. విజువల్ వండర్ గా ఈ సినిమా తెరకెక్కగా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చింది. అటు నానికి ఇటు సమంతకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది.
మొదట రాజమౌళి ఈగ సినిమాను చిన్న మూవీగా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించాలని అనుకున్నారు. 3 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈగ సినిమాను తెరకెక్కించి ఎంపిక చేసిన థియేటర్లలో రిలీజ్ చేయాలని జక్కన్న భావించగా పరిమిత బడ్జెట్ సినిమాకు సమస్యగా మారింది. తక్కువ బడ్జెట్ తో సినిమా తీయలేని పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత సురేష్ బాబు సూచనల మేరకు జక్కన్న అనుకున్న విధంగా సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించారు.
ఈ సినిమాకు సీక్వెల్ కావాలని జక్కన్న అభిమానులు కోరుకుంటున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈగ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉందని ఆ ఆలోచన కార్యరూపం దాల్చాలంటే మాత్రం చాలా సమయం పట్టే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను రాజ్యసభకు నామినేట్ చేసింది.
విజయేంద్ర ప్రసాద్ కు రచయితగా ప్రత్యేక గుర్తింపు ఉండటం వల్లే ఈ అరుదైన గౌరవం దక్కింది. బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ సినిమాల సక్సెస్ లో విజయేంద్ర ప్రసాద్ పాత్ర ఎంతో ఉంది. మహేష్ జక్కన్న కాంబో మూవీకి కూడా విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న సంగతి తెలిసిందే.
Most Recommended Video
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!