రాజమౌళి డ్రీమ్ ప్రాజక్ట్ తెరమీదకు ఎప్పుడు వస్తుంది ?

  • February 25, 2017 / 10:31 AM IST

స్టూడెంట్ నంబర్ వన్ చిత్రం నుంచి ప్రతి సినిమాను అంతకు మించి అన్నట్టుగా తెరకెక్కిస్తున్న డైరక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. మగధీర సినిమాతో దర్శకధీరుడు అనిపించుకున్న జక్కన్న ఇప్పటివరకు ఓటమి  అంటూ ఎరగలేదు. బాహుబలి తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించారు. ఆయన ప్రాజక్ట్ అంటే వెయ్యికోట్లు పెట్టడానికి కూడా నిర్మాతలు ముందుకు వస్తున్నారు. రాజమౌళి డ్రీమ్ ప్రాజక్ట్ మహా భారతం రూపొందించడానికి ఇదే సరైన సమయం. అమీర్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్ కూడా జక్కన్న కు డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మరి బాహుబలి కంక్లూజన్ తర్వాత ఆ పనిలోకి దిగుతారా? ఇదే ప్రశ్నను ఆయన ముందు ఉంచగా ఇలా స్పందించారు.

“మహా భారతాన్ని తీయడమనేది నా డ్రీమ్. అయితే దానికి చాలా అనుభవం కావాలి. ముఖ్యంగా టెక్నాలజీని వాడుకోవడం తెలియాలి. అప్పుడు బాగా చూపించగలం. అందుకు పదేళ్లు సమయం పట్టవచ్చు” అని రాజమౌళి వివరించారు. మరి ఏప్రిల్ 28 తర్వాత ఏ ప్రాజక్ట్ మొదలు పెడుతారు అంటే.. “కుటుంబ సభ్యులతో కలిసి పది రోజులు విహారానికి వెళ్లి వస్తాను” అని నవ్వుతూ చెప్పారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus