‘సాహో’ ఫలితాన్ని ముందుగానే పసిగట్టిన రాజమౌళి..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘సాహో’. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. ‘బాహుబలి2’ తరువాత ప్రభాస్ ను ఇలాంటి ‘కాస్ట్లీ ఎక్స్పరిమెంట్’ సినిమాలో ఊహించుకోలేకపోవడంతో నిరాశ చెందారు. కథ కథనం మొత్తం ప్రేక్షకుల మెదడుకి పని చెప్పేలా ఉండడం.. డైరెక్టర్ సుజీత్ ఇంటెలిజెన్స్ టేకింగ్ ను ప్రభాస్ అభిమానులు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఇక దొరికిందే ఛాన్స్ అని క్రిటిక్స్ ఈ చిత్రం పై విమర్శలు కురిపించారట. ఇదిలా ఉండగా.. ‘సాహో’ చిత్రంలో లోటు పాట్లు అన్నీ దర్శక ధీరుడు రాజమౌళి ముందే పసిగట్టాడట.

‘సాహో’ చిత్ర రన్ టైం ఎక్కువగా ఉంది.. తగ్గిస్తే బాగుంటుంది…. విడుదలకు కొన్ని రోజుల ముందే ప్రభాస్, దర్శకుడు సుజీత్, నిర్మాతలకు చెప్పాడట. అయితే స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ, సుజీత్ కు నచినట్టే కానిచ్చేద్దాం అని రాజమౌళికి ప్రభాస్ సర్దిచెప్పేశాడట. ఇక ‘సాహో’ మొదలవ్వడానికి ముందే ‘బాహుబలి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత యాక్షన్ సినిమా వద్దకి… ఏదైనా మంచి రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెయ్యమని కూడా ప్రభాస్ తో రాజమౌళి చెప్పాడట. కానీ ‘ముందుగానే సుజీత్ కు మాటిచ్చేసాను కాబట్టి ఈసారికి ఇలా కానిచ్చేద్దాం’ అని ప్రభాస్ సర్దిచెప్పేసాడట ప్రభాస్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus