Rajamouli: నార్వే లో ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి దంపతులు.. వైరల్ అవుతున్న ఫోటోలు

ఎస్.ఎస్.రాజమౌళి టాలీవుడ్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన దర్శకుడు. ‘బాహుబలి'(బాహుబలి ది బిగినింగ్) ‘బాహుబలి 2 ‘(బాహుబలి ది కన్ క్లూజన్) వంటి చిత్రాలతో నార్త్ లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. గతేడాది ‘ఆర్.ఆర్.ఆర్’ తో అయితే హాలీవుడ్లో కూడా సత్తా చాటాడు రాజమౌళి. రాంచరణ్, ఎన్టీఆర్ కలయికలో రూపొందిన ఈ సినిమా జపాన్ లో భారీ కలెక్షన్స్ ను సాధించింది. అక్కడి టాప్ 25 సినిమాల్లో ఆర్.ఆర్.ఆర్ కూడా చోటు దక్కించుకుంది.

అంతేకాకుండా ‘ఆర్.ఆర్.ఆర్’ లో నాటు నాటు పాటకు ఆస్కార్ కూడా లభించడం టాలీవుడ్ కి గర్వకారణంగా చెప్పుకోవాలి. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత రాజమౌళి చేసే సినిమా పై హాలీవుడ్ దృష్టి కూడా పడింది అని చెప్పడంలో సందేహం లేదు. రాజమౌళి తన తర్వాతి సినిమాని మహేష్ బాబుతో చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ గ్యాప్ లో రాజమౌళి ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లినట్టు తెలుస్తుంది.

అతను తన భార్య రమా (Rajamouli) రాజమౌళితో కలిసి నార్వేలో సందడి చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘మగధీర’ కోసం లొకేషన్ వేటలో భాగంగా అతను ఈ పాలిపట్ లేక్ దృశ్యాలు చూశాడట. అప్పటి నుండి ఆ ప్రదేశానికి వెళ్లాలని అనుకుంటున్నాడట. అది ఇప్పటికి కుదిరినట్టు.. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా చెప్పుకొచ్చాడు. ఇక రాజమౌళి పోస్ట్ చేసిన బ్యూటిఫుల్ పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus