Rajamouli: పక్క రాష్ట్రానికి వెళ్లిన రాజమౌళి… అక్కడే లాంగ్ షెడ్యూల్‌ ఉంటుందంటూ..!

రాజమౌళితో (S. S. Rajamouli)  సినిమా అంత ఈజీగా తెమిలేది కాదు. ఏళ్ల తరబడి షూటింగ్‌ చేస్తారని ఆయనకు పేరు. చిన్న సినిమాను కూడా నెలల తరబడి చిత్రీకరిస్తుంటారాయన. ఇక ప్రీప్రొడక్షన్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ లెక్క గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది దేశంలో అత్యధిక బడ్జెట్‌తో ప్రపంచం మొత్తం రిలీజ్‌ చేస్తారు అంటున్న సినిమా కదా ఆయన ఇంకెంత ఆలోచిస్తారో చెప్పండి. ఇప్పుడు ఆయన అదే పనిలో ఉన్నారు. షూటింగ్‌ స్పాట్స్‌ కోసం రెక్కీ నిర్వహిస్తున్నారు.

Rajamouli

మొన్నీమధ్యే ఆఫ్రికా అడవుల ప్రాంతాలకు వెళ్లి షూటింగ్‌ స్పాట్స్‌ రెక్కీ చేసిన ఆయన.. ఇప్పుడు పక్క రాష్ట్రం ఒడిశాకు వెళ్లారు. ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి తన కథకు తగ్గ లొకేషన్స్‌ను గుర్తిస్తున్నారని సమాచారం. ఒడిశాలో దిగిన రాజమౌళి టీంకు స్థానిక టీం, అభిమానులు స్వాగతం పలికారు. మూడు రోజుల పాటు సినిమా యూనిట్‌ దేవ్‌మాలి, తోలోమాలి, కొలాబ్‌ తదితర ప్రాంతాల్లో ఉంటుంది అని సమాచారం.

మామూలుగా అయితే రాజమౌళి తన సినిమాల్ని ఎక్కువ సెట్స్‌లో తీస్తుంటారు. వాటిని విజువల్‌ ఎఫెక్ట్స్‌ జోడిస్తుంటారు. దాని కోసం వివిధ ప్రాంతాలను రిఫరెన్స్‌లుగా తీసుకుంటూ ఉంటారు. గత చిత్రాల విషయంలో ఆయన చేసింది ఇదే. మరిప్పుడు మహేష్‌ (Mahesh Babu) సినిమా కోసం అలానే చేస్తారా? లేక మహేష్‌ను ఆ ప్రాంతాలకు తీసుకెళ్లి షూటింగ్‌ చేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే మహేష్‌ సినిమాలు రీసెంట్‌గా ఇండోర్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.

ఇక ఈ సినిమాను రెండు పార్ట్‌లుగా ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌. మొదటి పార్ట్‌ను 2027లో, రెండో పార్ట్‌ను 2029లో విడుదల చేస్తారని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే రాజమౌళి సినిమాలకు అంచనా డేట్లు వర్కౌట్‌ కావు. భారీ బడ్జెట్‌, ఎందరో ఎదురుచూస్తున్న కాంబో కావడంతో రెండు పార్టులు రావడం అనేది పెద్దగా ఆశ్చర్యపరచని విషయం అనే చెప్పాలి. అదే జరిగితే మహేష్‌ను మరో నాలుగైదేళ్లు ఇతర సినిమాల్లో చూడలేం. ఇక ఈ సినిమాను ఎప్పుడు స్టార్ట్‌ చేస్తారు అనే విషయంలో అయితే ఎలాంటి సమాచారం లేదు.

అటు తిరిగి.. ఇటు తిరిగి మైత్రీ మీదకు వచ్చిన ‘సంధ్య’ థియేటర్‌ ఘటన!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus