Rajamouli: జక్కన్నకు ఓరిగామీ క్రేన్స్ గిఫ్ట్ గా ఇచ్చిన వృద్ధురాలు.. వాటి ప్రత్యేకత ఇదే!

టాలీవుడ్, బాలీవుడ్, ఇతర ఇండస్ట్రీలలో రాజమౌళికి (SS Rajamouli) ఏ స్థాయిలో గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విదేశాల్లో కూడా రాజమౌళిని అభిమానించే ఫ్యాన్స్ ఉన్నారు. జపాన్ లో ఆర్ఆర్ఆర్ (RRR) స్క్రీనింగ్ కు రాజమౌళి దంపతులు హాజరు కాగా 83 ఏళ్ల వృద్ధురాలు ఆర్ఆర్ఆర్ సినిమాను చూడటంతో పాటు జక్కన్నపై అభిమానంతో ఆ వృద్ధురాలు ఓరిగామీ క్రేన్స్ ను బహుమతిగా ఇచ్చారు. జపాన్ లో తాము అభిమానించే వాళ్లు ఆరోగ్యంగా, అందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఓరిగామీ క్రేన్స్ ను బహుమతిగా ఇస్తారు.

వృద్ధురాలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1000 ఓరిగామీ క్రేన్స్ ను రాజమౌళి దంపతులకు గిఫ్ట్ గా ఇవ్వడం గమనార్హం. రాజమౌళిపై ఆ వృద్ధురాలు చూపించిన అభిమానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతగానో నచ్చడంతో వృద్ధురాలు ఈ విధంగా చేశారని తెలుస్తోంది. వృద్ధురాలు ఇచ్చిన బహుమతి గురించి రాజమౌళి స్పందిస్తూ బహుమతులను నాకు గిఫ్ట్ గా పంపిన వృద్ధురాలు ఆమె మాత్రం చలిలోనే ఉండిపోయిందని చెప్పుకొచ్చారు.

కొందరి అభిమానానికి వెల కట్టలేమని జస్ట్ గ్రేట్ ఫుల్ అని రాజమౌళి కామెంట్లు చేశారు. రాజమౌళి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. రాజమౌళి మహేష్ సినిమాకు సంబంధించి కూడా ఆసక్తికర అప్ డేట్స్ ఇచ్చారు. ప్రస్తుతం మహేష్ సినిమాకు సంబంధించిన సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని త్వరలో షూటింగ్ ను మొదలుపెడతామని జక్కన్న కామెంట్లు చేశారు.

వేగంగా నిర్మాణాన్ని పూర్తి చేసి మహేష్ బాబును (Mahesh Babu) జపాన్ కు తీసుకురావాలని భావిస్తున్నానని రాజమౌళి అభిప్రాయపడుతున్నారు. రాజమౌళి మహేష్ కాంబో సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. రాజమౌళి మహేష్ మూవీ స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus