పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న చెన్నైలో ఘనంగా జరిగింది. దర్శకధీరుడు రాజమౌళి మాట్లాడుతూ ఎన్టీఆర్, చరణ్ ఒక స్థాయికి వెళ్లాలని అనుకుంటున్నారని ఈ ఇద్దరు హీరోల ప్రయాణం వేరని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ తనకంటే సీనియర్ అని ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటాడని రాజమౌళి అన్నారు. చరణ్ ఎన్టీఆర్ గురించి లయన్ పర్సనాలిటీ, చైల్డ్ మెంటాలిటీ అని చెప్పాడని ఆ మాటలు నిజమేనని జక్కన్న అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ప్రేమను తట్టుకోవడం చాలా కష్టమని రాజమౌళి చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కు టైమ్ సెన్స్ ఉండదని సెట్ కు చెప్పిన టైమ్ కంటే ముందే వస్తాడని రాజమౌళి తెలిపారు. యాక్షన్ చెబితే మనసులో ఏం ఉందో ఎన్టీఆర్ అదే చేస్తాడని జక్కన్న చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ లాంటి నటుడు దొరకడం నా అదృష్టమో టాలీవుడ్ అదృష్టమో కాదని ఇండియన్ ఇండస్ట్రీ అదృష్టమని జక్కన్న కామెంట్లు చేశారు. మూడు సంవత్సరాలు ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు పరిమితమైనందుకు జూనియర్ ఎన్టీఆర్ కు థ్యాంక్స్ అని రాజమౌళి చెప్పుకొచ్చారు.
చరణ్ ను మై హీరో అంటుంటానని జక్కన్న తెలిపారు. క్లియర్ మైండ్ తో ఎలాంటి ఒత్తిడి లేకుండా చరణ్ సెట్ కు వస్తాడని జక్కన్న వెల్లడించారు. దర్శకుడికి ఏం కావాలి దాన్ని నేను ఎలా చేయగలను అని ఆలోచించే మెంటాలిటీ చరణ్ మెంటాలిటీ అని జక్కన్న కామెంట్లు చేశారు. చరణ్ లాంటి మెంటాలిటీని తాను ఎక్కడా చూడలేదని రాజమౌళి చెప్పుకొచ్చారు. చరణ్, తారక్ లలో ఒకరు ఉత్తర ధృవం అయితే మరొకరు దక్షిణ ధృవం అని జక్కన్న అన్నారు.
ఈ రెండు ధృవాలు ఆర్‌ఆర్‌ఆర్ అయస్కాంతానికి అతుక్కున్నందుకు తాను ఆనందిస్తున్నానని రాజమౌళి వెల్లడించారు. బాహుబలి సిరీస్ లా ఆర్‌ఆర్‌ఆర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని రాజమౌళి పేర్కొన్నారు. త్వరలో హైదరాబాద్ లో కూడా ఆర్‌ఆర్‌ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. 2022 సంవత్సరం జనవరి 7వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.
Most Recommended Video
83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!