Rajamouli: హాలీవుడ్‌తో రాజమౌళి డీల్‌.. ఎందుకో?

రాజమౌళి సినిమా అంటే హాలీవుడ్‌ సినిమాలా ఉంటుంది. మనదైన ఎమోషన్స్‌ను అందులో చూపించడం వల్ల హాలీవుడ్‌ సినిమాలో లేనిది కూడా ఆ సినిమాలో ఉంటుంది అని చెబుతుంటారు. అలాంటి జక్కన్న హాలీవుడ్‌ సినిమా చేస్తే.. వావ్‌ అదిరిపోతుంది కదా. అయినా ఇప్పుడు రాజమౌళి ఉన్న పరిస్థితుల్లో హాలీవుడ్‌ వెళ్లి సినిమాలు చేయడం కష్టమే అంటారా? నిన్నటివరకు మీరు చెప్పిన మాటకు యస్‌ అనే అనేవాళ్లం. అయితే ఇప్పుడు ఆ మాట అనలేం. ఎందుకంటే ఆయన ఓ ప్రముఖ హాలీవుడ్‌ కంపెనీతో టై అప్‌ అయ్యారట.

‘బాహుబలి’తో భారతీయ సినిమాను, నటులు, సాంకేతిక నిపుణులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు రాజమౌళి. రెండు ‘బాహుబలి’ సినిమాలు ఎంతటి విజయం అందుకున్నాయో మనకు తెలిసిందే. ఆ సినిమాల గొప్పతనాన్ని ఆస్వాదిస్తుండగానే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అంటూ మరో భారీ సినిమా తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఆదరిస్తున్నారు. అంతర్జాతీయ నటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమా గురించి గొప్పగా చెబుతున్నారు. దీంతో రాజమౌళి నెక్స్ట్‌ సినిమా హాలీవుడ్‌ని మించిపోవాలి అని కొందరు, హాలీవుడ్‌ సినిమానే చేయాలని ఇంకొందరు కోరుకుంటున్నారు.

ఈ క్రమంలోనే హాలీవుడ్‌ సంస్థతో రాజమౌళి టై అప్‌ అయ్యారని వార్తలొస్తున్నాయి. హాలీవుడ్‌లోని ఓ ప్రముఖ ఏజెన్సీ అయిన క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ (CAA)తో రాజమౌళి డీల్ కుదుర్చుకున్నారట. హాలీవుడ్‌లో ప్రముఖ బ్రాండ్స్ నుండి ముఖ్య నటీనటులు ఈ ఏజెన్సీ ఆధ్వర్యంలోనే ఉన్నారు. అలాంటి సంస్థతో రాజమౌళి డీల్ అనేసరికి ఆసక్తికరంగా మారింది. దీంతో రాజమౌళి చేసే నెక్స్ట్ ప్రాజెక్ట్‌ల విషయంలో ఆసక్తి డబుల్‌ ట్రిపుల్‌ అవుతోంది.

అయితే డీల్‌ ఏంటి, ఎందుకు కుదుర్చుకున్నారు అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు హాలీవుడ్‌లో రాజమౌళి ఓ యానిమేషన్‌ సినిమా చేయాల్సి ఉందని కొన్నేళ్ల క్రితం ఆయన తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ చెప్పారు. మరి ఆ సినిమా కోసమా, లేక ఇంకేదైనా సినిమా కోసమా ఈ డీల్‌ అనేది తెలియాల్సి ఉంది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus