దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి డ్రీమ్ ప్రాజక్ట్ మహా భారతం. భారతీయులందరికీ తెలిసిన కథను వారు ఆశ్చర్యపోయే రీతిలో చిత్రీకరించాలని జక్కన్న ఆశపడుతున్నారు. బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఏర్పరుచున్న స్టార్ డైరక్టర్.. బాహుబలి 2 తర్వాత ఈ సినిమాని తెరకెక్కించాలని భావిస్తున్నారు. ఇది ఒకే భాషకు పరిమితం కాకుండా.. ఏకకాలంలో ఐదు భాష(తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ) ల్లో నిర్మించాలని ఆలోచనలో ఉన్నారు. అందుకు తగినట్లుగా ఈ మహా భారతంలోని ముఖ్య పాత్రలకు సూపర్ స్టార్లను సెలక్ట్ చేసుకుంటున్నారు.
శ్రీ కృష్ణుడి గా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, భీష్మగా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, కర్ణుడిగా మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ని నటింప చేయాలని డిసైడ్ అయ్యారు. అర్జునుడి పాత్ర యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఎప్పుడో ఇచ్చేశారని తెలిసింది. బాహుబలి కంక్లూజన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత స్క్రిప్ట్ పనుల్లో రచయిత విజయేంద్ర ప్రసాద్, సూపర్ స్టార్స్ డేట్స్ సెట్ చేసే పనిలో జక్కన్న బిజీకానున్నారు. దాదాపు ఆరేళ్ళ పాటు చిత్రీకరణ సాగే ఈ మూవీని ఆర్కా మీడియా వారే నిర్మిస్తారా? బాలీవుడ్ నిర్మాణ సంస్థలు ముందుకు వస్తాయా? అనే విషయం త్వరలోనే తెలియనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.