టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి రూటే సపరేట్ అనే సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్ లో ఏదైనా సినిమా తెరకెక్కితే ఆ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను అందుకోవాల్సిందేనని అందరూ భావిస్తారు. రాజమౌళి మాత్రం తన డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా ఇండస్ట్రీ హిట్ కావడంతో పాటు అవార్డులు కూడా సాధించాలని కోరుకుంటున్నారు. ఈ దిశగా జక్కన్న అడుగులు వేస్తుండటం గమనార్హం. ఈ రెండు విషయాలలో అస్సలు తగ్గకూడదని రాజమౌళి భావిస్తున్నారని బోగట్టా.
వేగంగా సినిమాలను తెరకెక్కించడం కంటే నిదానంగా సినిమా తెరకెక్కించినా సినిమా సక్సెస్ సాధించాలని రాజమౌళి భావిస్తున్నారు. మహేష్ రాజమౌళి కాంబో సినిమా కథ, కథనానికి సంబంధించి ఇప్పటికే పనులు మొదలయ్యాయని బోగట్టా. ఈ ఏడాది చివరినాటికి ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తవుతుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. 2023 సంవత్సరం జూన్ లేదా జులై నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
బాహుబలి2, ఆర్ఆర్ఆర్ సినిమాలను మించేలా ఈ సినిమా ఉండాలని జక్కన్న భావిస్తున్నారు. బాహుబలి2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేసేలా ఈ సినిమా ఉండనుందని బోగట్టా. రాజమౌళి తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాజమౌళి ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్, లాభాల రూపంలో భారీ మొత్తంలో తీసుకుంటున్నారని తెలుస్తోంది.
జక్కన్న తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. మహేష్ కు జోడీగా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ను జక్కన్న ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది. మహేష్ జక్కన్న కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?