బాలకృష్ణ తో సినిమా చెయ్యాలి అనుకున్నాను కానీ : రాజమౌళి

నందమూరి బాలకృష్ణ … కనుక మాస్ సినిమా తీస్తే కచ్చితంగా అది పెద్ద హిట్ అవుతుంది అని కొందరు దర్శకులు చెబుతుంటారు. అందుకు తగినట్టే… మాస్ లో బాలయ్యకు ఇప్పటికీ పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలయ్య ప్రతీ సినిమా హిట్ కాకపోయినా… ఏ బోయపాటి డైరెక్షన్లో మంచి మాస్ సినిమా చేస్తే మాత్రం ఇప్పుడున్న కుర్ర హీరోలకు ధీటుగా కలెక్షన్లు రాబడుతున్నాడు. ఇదిలా ఉంటే… ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.

కానీ అప్పట్లో రాజమౌళి మాస్ సినిమాలకు పెట్టింది పేరు. అయితే బాలయ్య ఫుల్ ఫామ్లో ఉన్న రోజుల్లో రాజమౌళి ఎందుకు … ఇతనితో సినిమా చెయ్యలేదు అనే డౌట్ అందరిలోనూ ఉంది. దీనికి రాజమౌళి తాజాగా స్పందించారు … “ప్రతి దర్శకుడికీ తన మనసులో ప్రతీ స్టార్ హీరోతో సినిమాల చేసి… తన స్థాయిని మరింతగా పెంచుకోవాలని ఉంటుంది. ఏదైనా కథ అనుకున్నప్పుడు, పలానా హీరో అయితే సరిపోతాడు అని దర్శకులకు అనిపిస్తుంది.

నాకు కూడా కొన్ని కథలు విన్నప్పుడు బాలకృష్ణ గారు అయితే… బాగుంటుందని అనిపించింది. అయితే ఆయనతో సినిమా మాత్రం చెయ్యడం ఇంకా కుదర్లేదు. అప్పట్లో, బాలకృష్ణ గారు నటించిన ప్రతీ సినిమా ఫస్ట్ డే… ఫస్ట్ షో చూసేవాడిని. ఇప్పటికీ బాలకృష్ణ గారి సినిమా మొదటి రోజే థియేటర్ కు వెళ్ళి చూస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను రాజమౌళి ఇంటి నుండే చేస్తున్నాడట.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
సమంత బర్త్ డే స్పెషల్ : రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus