యంగ్ రెబల్ స్టార్ పుట్టినరోజుకి మంచి కానుక ఇవ్వనున్న జక్కన

  • September 29, 2016 / 09:07 AM IST

ప్రపంచ సినీ జనాలు మెచ్చిన బాహుబలి చిత్రం రూపుదిద్దుకోవడం వెనుక దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కృషి ఎంత ఉందో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కష్టం కూడా అంతే ఉంది. మూడేళ్లుగా ఆ సినిమా కోసం డార్లింగ్ శ్రమిస్తున్నారు. మరే సినిమాలోనే కాదు.. పబ్లిక్ కార్యక్రమాలకు హాజరవడం కూడా తగ్గించేశారు. పని పట్ల అంత నిబద్దత కలిగిన ప్రభాస్ పై అభిమానంతో జక్కన్న ఓ కానుక ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

ప్రస్తుతం బాహుబలి కంక్లూజన్ ను పూర్తి చేసే పనిలో ఉన్న దర్శకధీరుడు… పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా చేయిస్తున్నారు. ప్రభాస్ పుట్టిన రోజు నాటికి బాహుబలి 2 టీజర్ రెడీ కావాలని ఎడిటర్లకు ఆదేశించారని తెలిసింది. అక్టోబర్ 23 న 30 సెకన్ల టీజర్ రిలీజ్ చేసి.. యంగ్ రెబల్ స్టార్ కి కానుక ఇవ్వనున్నట్లు సమాచారం. పుట్టినరోజున జక్కన్న ఇచ్చే గిఫ్ట్ ప్రభాస్ కి మాత్రమే కాదు, అయన అభిమానులకు సైతం సంతోషాన్ని ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus