Rajamouli: స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇన్ని సినిమాలలో గెస్ట్ రోల్స్ లో కనిపించారా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళికి ఆకాశమే హద్దుగా ప్రేక్షకుల్లో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమాలో చిన్న రోల్ దక్కినా ఊహించని స్థాయిలో గుర్తింపు వస్తుందని చాలామంది నటీనటులు ఫీలవుతున్నారు. అయితే రాజమౌళి సినిమాలలో గెస్ట్ రోల్స్ లో, క్యామియో రోల్స్ లో కనిపించారు. మరికొన్ని సినిమాలకు రాజమౌళి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ విషయం తెలిసిన నెటిజన్లు రాజమౌళి ఏదైనా సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

జక్కన్న తొలిసారి సై మూవీలో వేణుమాధవ్ అనుచరుడిగా కనిపించగా

ఆ తర్వాత రెయిన్ బో సినిమాలో నటించారు.

మగధీర సినిమాలో అనగనగా పాటలో క్యామియో రోల్ లో కనిపించి రాజమౌళి ఆకట్టుకున్నారు.

ఈగ సినిమాలో స్టార్టింగ్ లో కథ చెప్పింది జక్కన్న కావడం గమనార్హం. బాహుబలిలో సారా అమ్మే వ్యక్తిగా మజ్ను మూవీలో దర్శకుడిగా కనిపించారు.

ప్రభాస్ రాధేశ్యామ్ మూవీలో కథను మొదలుపెట్టేది జక్కన్ననే కాగా ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నెత్తురు మరిగితే సాంగ్ లో రాజమౌళి కనిపించారు.

తన సినిమాలలో నటించే నటులకు ఏ సీన్ లో ఎలా యాక్ట్ చేయాలో జక్కన్న దగ్గరుండి చూపిస్తారనే సంగతి తెలిసిందే. రాజమౌళి పారితోషికం 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. రాజమౌళి పారితోషికం 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్న రాజమౌళి మహేష్ సినిమాను ఇండియానా జోన్స్ తరహాలో తెరకెక్కిస్తున్నారు.

త్వరలో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయి. ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్ల రూపాయలు కాగా కేఎల్ నారాయణ మాత్రమే ఈ సినిమాకు  నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం అందుతోంది. రాజమౌళి (Rajamouli) సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus