Rajamouli, Jr NTR: తారక్ లో నాకు నచ్చే విషయం అదే: రాజమౌళి

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ఎన్టీఆర్ కూడా ఒకరు ఈయన నటుడిగా మాత్రమే కాకుండా తన వ్యక్తిగత జీవితంలో కూడా ఒక సాధారణ వ్యక్తిలా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా హీరోగా ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈయన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇటీవల రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా ఈయనకు ఎన్టీఆర్ గురించి ఒక ప్రశ్న ఎదురైంది మీరు ఎన్టీఆర్ ను చాలా దగ్గరగా చూస్తున్న వ్యక్తి మీకు ఎన్టీఆర్ లో నటుడిగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా నచ్చే విషయం ఏంటి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు రాజమౌళి సమాధానం చెబుతూ ఎన్టీఆర్ తో కలిసి తాను ఇన్ని సంవత్సరాల పాటు ప్రయాణం చేస్తున్నాను

అయితే ఆయన కెరియర్ పరంగా ఆయనకు ఎంతో ఫ్లాప్ సినిమాలను అందించినటువంటి డైరెక్టర్లు కూడా ఉన్నారు అయితే ఎప్పుడు కూడా పలానా డైరెక్టర్ ఇలాంటి వ్యక్తి అనే విషయాలను నా దగ్గర చెప్పలేదు. సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా ఏ డైరెక్టర్ గురించి ఆయన నా దగ్గర నెగిటివ్గా చెప్పలేదని ఎన్టీఆర్ తెలిపారు. ఇలా ఇతరుల గురించి చెడుగా మాట్లాడే వ్యక్తిత్వం ఎన్టీఆర్లో లేదు అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి ఆయన మనస్తత్వం గురించి రాజమౌళి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి

కాకపోతే ఎన్టీఆర్ (Jr NTR) సరదాగా సంతోషంగా ఉన్న సమయంలో కొంతమంది గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ ఎప్పుడూ కూడా చెడుగా మాట్లాడారని ఈ సందర్భంగా రాజమౌళి ఎన్టీఆర్ గురించి కామెంట్లు చేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus