Rajamouli, Mahesh Babu: రాజమౌళికి పూరి డైలాగ్ తో రిప్లై ఇచ్చిన మహేష్ బాబు!

#SSMB29 సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకున్నప్పటికీ.. కనీసం ఫోటోలు కూడా బయటికి రాలేదంటూ అభిమానులు గోల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. పూజా కార్యక్రమాల తర్వాత కూడా మహేష్ బాబు ఎయిర్ పోర్టుల్లో కనిపిస్తుండడంతో.. అసలు షూటింగ్ జరుగుతుందా లేదా? అనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. ఎట్టకేలకు రాజమౌళి నిన్న తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ ద్వారా ఒక అప్డేట్ ఇచ్చాడు. పాస్ పోర్ట్ లాక్కుని మహేష్ ను లాక్ చేసినట్లుగా అర్థం వచ్చేలా “స్పైడర్”లో ఎస్.జె.సూర్యల నవ్వుతూ.. అదే సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ తో.. చేతిలో పాస్ పోర్ట్ తో ఒక చిన్న వీడియో పోస్ట్ చేశాడు రాజమౌళి.

Rajamouli, Mahesh Babu

సదరు వీడియోకి “కాప్చ్యూర్డ్” అంటే బంధించేసాను అని క్యాప్షన్ పెట్టడంతో మహేష్ అభిమానులందరికీ అది మహేష్ బాబు పాస్ పోర్ట్ అని అర్థమైపోయింది. ఆ పోస్ట్ కి వెంటనే ప్రియాంక చోప్రా “ఫైనల్లీ” అని రిప్లై పెట్టి సంతోషం వ్యక్తం చేయగా.. పోస్ట్ పెట్టిన గంటకి మహేష్ బాబు “ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను” అంటూ పోకిరి డైలాగ్ తో రిప్లై ఇవ్వడంతో ఇన్స్టాగ్రామ్ & ట్విట్టర్ మొత్తం మీమ్స్ తో నిండిపోయింది. కొంతమంది అభిమానులైతే.. “అదే చేత్తో.. ఇన్స్టాగ్రామ్ & ట్విట్టర్ పాస్వర్డ్ కూడా మార్చేయండి” అంటూ మహేష్ మూవీ రివ్యూస్ గురించి ఇండైరెక్ట్ కామెంట్ చేశారు.

ఏదేమైనా.. ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమా గురించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ & కన్ఫర్మేషన్ ఇలా సరదా పోస్టులతో ఇవ్వడం అనేది మంచి పబ్లిసిటీ స్ట్రాటజీ. ఎందుకంటే.. ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసేకంటే, ఇలాంటి ఆసక్తికమైన సోషల్ మీడియా పోస్టుల ద్వారానే ఎక్కువ రీచ్ ఉంటుంది. ఆ విషయాన్ని రాజమౌళి బాగా అర్థం చేసుకున్నారని చెప్పాలి.

సినీ పరిశ్రమలో విషాదం.. కామెర్లతో బాధపడుతూ నటుడు కన్నుమూత!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus