Rajamouli: ఆ బ్లాక్‌బస్టర్‌ను రాజమౌళి అలా మిస్‌ చేసుకున్నారా? ఆయన చేసుంటేనా?

‘బాహుబలి’ సినిమాలతో ఎస్‌ ఎస్‌ రాజమౌళి పాన్‌ ఇండియా డైరెక్టర్‌ అయ్యారు. అయితే అంతకుముందే ఆయన ఓ పాన్‌ ఇండియా సినిమాను వదులుకున్నారా? అంటే అవును అనే చెప్పాలి. ‘బజరంగీ భాయ్‌జాన్‌’ లాంటి సినిమాను ఓ తెలుగు హీరో చేసి ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. అదిరిపోతుంది కదా. ఈ రెండూ ఎండ వల్ల మిస్‌ అయ్యాయని మీకు తెలుసా? మీరు చదివింది నిజమే… నడి నెత్తిన మండిపోయే ఉండటం వల్లనే ఆ సినిమాను రాజమౌళి, తెలుగు హీరో మిస్‌ అయ్యారు. ఈ విషయాన్ని ఓసారి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ చెప్పారు.

ఇంతకీ ఏమైందంటే… సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘బజరంగీ భాయ్‌జాన్‌’ సినిమా హిందీలో బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. ఆ మాటకొస్తే దేశం మొత్తం ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అయితే ఈ సినిమా రాజమౌళి డైరెక్ట్ చేయాల్సింది. కానీ కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించారు. మామూలుగా ఏదైనా కథ రాసుకున్నాక రాజమౌళికి చెబుతుంటారు విజయేంద్ర ప్రసాద్‌. అలా ‘బజరంగీ భాయ్‌జాన్‌’ కథను కూడా చెప్పారట. కానీ రాజమౌళి నో చెప్పేశారట. ఆ తర్వాత విజయం చూశాక ఎందుకు నో చెప్పానా అనుకున్నారట.

‘బాహుబలి’ సినిమాల సమయంలో ఓసారి విజయేంద్రప్రసాద్‌.. (Rajamouli) రాజమౌళికి ‘బజరంగీ భాయ్‌జాన్‌’ సినిమా కథ చెప్పారట. అప్పటికే ఆ కథ సల్మాన్‌ ఖాన్‌కు చెప్పేశారట. షూటింగ్‌ గ్యాప్‌లో ఎండలో కథ విన్న రాజమౌళి కథలోని ఎమోషన్స్ కి కన్నీళ్లు పెట్టుకున్నారట. అయితే ఏమైందో ఏమో కథను వేరే వాళ్లకు ఇస్తారంటే ఇచ్చేయండి అన్నారట. దాంతో ఆ సినిమాను కబీర్‌ ఖాన్‌ చేశారు. ఈ సినిమా సుమారు రూ. 600 కోట్లు వసూలు చేసింది.

ఆ సినిమా విడుదలై భారీ విజయం అందుకున్న తర్వాత ఓ సారి ఇంట్లో విజయేంద్రప్రసాద్‌, రాజమౌళి మధ్య చర్చ వచ్చిందట. ‘ఆ రోజు ఎండ మంచి కాకమీద ఉన్న సమయంలో కథ చెప్పారు. ఆ మూడ్‌లో వేరే వాళ్లకి ఇచ్చేయమన్నాను. అదే ఓ 15 రోజుల ముందు చెప్పినా, తర్వాత చెప్పినా నేనే చేసేవాణ్ని అని అన్నారట. ఎండ చిరాకుతో ఆ సినిమా వదులుకున్నాను అని అన్నారట. నిజమే కదా ముందే చెప్పుంటే ఆయన చేసేవారు. సల్మాన్‌ ఖాన్‌కు చెప్పకపోయి ఉంటే తెలుగు హీరో చేసేవారు.

సుందరం మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!

మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా రివ్యూ & రేటింగ్!
సిద్ధార్ధ్ రాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus