సుబ్బరాజు హీరోగా సినిమా తెరకెక్కించనున్న రాజమౌళి
- May 3, 2017 / 06:35 AM ISTByFilmy Focus
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?.. రెండేళ్ల తర్వాత ఈ ప్రశ్నకు జవాబు దొరికింది. ఇప్పుడు మరో ప్రశ్న తొలిచి వేస్తోంది. వెయ్యికోట్ల సినిమాను తెరకెక్కించిన రాజమౌళి నెక్స్ట్ ఏ సినిమాను తీయబోతున్నారు? .. ఈ ప్రశ్న ప్రస్తుతం అందరినోట వినిపిస్తోంది. మొన్నటి వరకు మహాభారతాన్ని తీస్తారని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పట్లో ఆ సినిమాను తీయమని జక్కన్న స్పష్టం చేశారు. దీంతో రాజమౌళి నెక్స్ట్ హీరో ఎవరో తెలుసుకోవాలని ఆరాటం తెలుగు ప్రేక్షకుల్లో పెరిగింది. ఈ విషయంపై ఆరా తీయగా ఆసక్తికర సంగతి బయటి పడింది.
బాహుబలి తర్వాత రాజమౌళి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో పనిలేని ఓ సినిమాని రూపొందించాలని భావిస్తున్నారంట. అంతేకాదు ఆ సినిమాలో సుబ్బరాజుని హీరోగా అనుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు సీరియస్ రోల్స్ లో కనిపించే సుబ్బరాజు బాహుబలిలో కామెడీ రోల్ పోషించారు. అతని కామెడీ టైమింగ్ మెచ్చి పూర్తిగా కామెడీ ఫిలిం తీయాలని జక్కన తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కి చెప్పినట్లు సమాచారం. ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












