టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళికి భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలన్నీ సంచలన విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు ఆయన సినిమాల గురించి ప్రేక్షకుల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది. అయితే రాజమౌళి తర్వాత సినిమా షూటింగ్ మొదలుకావడానికి చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. తాజాగా రాజమౌళి ఒక సందర్భంలో మాట్లాడుతూ మహేష్ బాబు సినిమాను అనుకున్న విధంగా సెట్స్ పైకి తీసుకొని రావడం సాధ్యం కాదని వెల్లడించారు.
2023 ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా షూటింగ్ మొదలుకావాల్సి ఉన్నా మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ అంతకంతకూ ఆలస్యమవుతూ ఉండటంతో మహేష్ జక్కన్న కాంబో మూవీ కూడా ఆలస్యమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజమౌళి సినిమా అంటే హీరో లుక్ ఇతర సినిమాలతో పోల్చి చూస్తే భిన్నంగా ఉంటుంది. రాజమౌళి సినిమా కోసం లుక్ ను మార్చుకున్న హీరోలు సినిమా ఎంత ఆలస్యమైనా అదే లుక్ కు పరిమితం కావాల్సి ఉంటుంది.
ఈ కారణం వల్లే ఈ ప్రాజెక్ట్ ను వచ్చే ఏడాది సెకండాఫ్ లో మొదలుపెట్టాలని జక్కన్న భావిస్తున్నారు. అయితే ప్రీ ప్రొడక్షన్ పనులను ముందుగానే మొదలుపెట్టడం ద్వారా ఈ సినిమా షూటింగ్ మరీ ఆలస్యం కాకుండా జక్కన్న జాగ్రత్తలు తీసుకోనున్నారు. 2025 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి ఈ సినిమాను భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించనున్నారని బోగట్టా.
600 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. కేఎల్ నారాయణ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మహేష్ రాజమౌళి కాంబో సినిమా షూటింగ్ మొదలుకాకముందే ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయని బోగట్టా. సినిమాసినిమాకు జక్కన్న రేంజ్ పెరుగుతోంది.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?