Rajamouli: కల్కిలో రాజమౌళి చేసే పాత్ర ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!

ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి 2898AD’లో దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి నటిస్తున్నాడని ఇటీవల ఓ వార్త బయటికి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో కల్కీపై ఉన్న అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి చేరిపోయాయి. అయితే రాజమౌళి ‘కల్కి’లో ఎలాంటి రోల్ చేస్తున్నారనే విషయంపై ఆడియన్స్ లో సర్వత్ర ఆసక్తి నెలకొనగా తాజాగా రాజమౌళి రోల్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. డీటెయిల్స్ లోకి వెళితే.

యంగ్ టాలెంటెడ్ ఫిలిం మేకర్ నాగ్ అశ్విన్ ప్రభాస్ తో చేస్తున్న ‘కల్కి’ని హాలీవుడ్ లెవెల్ లో రూపొందిస్తున్నారు. ఇందులో సినిమాలో ప్రభాస్ శ్రీమహావిష్ణువు చివరి అవతారమైన కల్కిగా కనిపించబోతున్నాడని తెలియడంతో సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. అమితాబచ్చన్ ఇందులో లార్డ్ పరశురామ్ పాత్ర చేస్తున్నారు. అలాగే కమలహాసన్ విలన్ గా కనిపించబోతున్నారు.

కమల్ హాసన్ వేరే హీరో సినిమాలో విలన్ గా కనిపించడం ఇదే తొలిసారి. వీళ్లతో పాటు దర్శక దిగ్గజం రాజమౌళి కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే కదా. ప్రభాస్ తో రాజమౌళికి ఉన్న బాండింగ్, వైజయంతి మూవీస్ తో ఉన్న అనుబంధం కారణంగా కల్కిలో ఇంట్రెస్టింగ్ రోల్ కోసం రాజమౌళిని ఆఫర్ చేశారట. ఆ రోల్ లో నటించడానికి జక్కన్న సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక తాజా సమాచారం ప్రకారం ‘కల్కి’లో రాజమౌళి (Rajamouli) సైంటిస్ట్ పాత్రలో కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

సినిమాలో ప్రయోగాలు చేసే శాస్త్రవేత్తగా రాజమౌళి కనిపిస్తారట. సినిమాకు ఆయన పాత్ర కూడా కీలకం కానుందని అంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియకపోయినా కల్కిలో రాజమౌళి సైంటిస్ట్ గా చేస్తున్నారనే న్యూస్ మాత్రం వైరల్ అవుతుంది. సినిమాలో రాజమౌళి నటించడమే కాకుండా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కు సలహాలుజ్ సూచనలు కూడా ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus