Rajamouli: జక్కన్న దోస్తీ థీమ్ ను రిపీట్ చేశారా?

దర్శకధీరుడు రాజమౌళి దాదాపు నాలుగు సంవత్సరాలు శ్రమించి ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించారనే సంగతి తెలిసిందే. దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుండగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు ఉండదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి విడుదలైన దోస్తీ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

ఈ పాటకు యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించగా అజయ్ దేవగణ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ మూవీలోని దోస్తీ సాంగ్ గురించి జక్కన్న 20 సంవత్సరాల క్రితమే చెప్పారని నెట్టింట ఒక వార్త వైరల్ అవుతోంది.

ఆర్ఆర్ఆర్ లిరికల్ వీడియోలో దోస్తీ సింబల్ కనిపిస్తుంది. 20 సంవత్సరాల క్రితం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన స్టూడెంట్ నంబర్ 1 సినిమాలోని ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సాంగ్ లో కూడా షేక్ హ్యాండ్ గుర్తు కనిపిస్తుంది. ఆ పాటలో వాడిన దోస్తీ థీమ్ ఇప్పుడు రిపీట్ కావడం గురించి నెటిజన్లు జక్కన్న 20 ఏళ్ల క్రితం చూపించిందే మళ్లీ చూపిస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus