కన్నడ ప్రజలకు రాజమౌళి విన్నపం

  • April 20, 2017 / 09:46 AM IST

ప్రపంచవ్యాప్తంగా బాహుబలి కంక్లూజన్ ఈ నెల 28 వ తేదీన రిలీజ్ కానుంది. కర్ణాటక రాష్ట్రంలో ఈ సినిమా రిలీజ్ కాకుండా అక్కడి వారు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కావేరీ జలాల విషయంలో సత్యరాజ్‌ అమర్యాదకంగా మాట్లాడారని, అందుకే అతను నటించిన సినిమా విడుదలయ్యే రోజున రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ నిర్వహిస్తామని కొన్ని సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ వివాదంపై రాజమౌళి ఈరోజు వీడియో రూపంలో స్పందించారు. “బాహుబలి 2 రిలీజ్ విషయంలో నా మాటలు కన్నడ వారికీ బాధ కలిగించి ఉంటే క్షమించండి. తొమ్మిదేళ్లకు ముందు సత్యరాజ్‌ మీ గురించి మాట్లాడారు.

ఈ మధ్య కాలంలో ఆయన నటించిన 30 సినిమాలు కర్ణాటకలో విడుదలయ్యాయి. బాహుబలి బిగినింగ్ కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు బహుబలి 2  ని అడ్డుకోవడం ఎంతవరకు న్యాయం. ఇది సత్యరాజ్ సినిమా కాదు. ఆయన నిర్మించలేదు. ఈ సినిమాకు పనిచేసిన ఎంతోమందిలో అతను ఒకరు. అతని మీద కోపానికి మా అందరిపై కక్షకట్టడం మంచిదేనా. మీ మధ్య బేధప్రాయాలుంటే మీరు మాట్లాడుకోండి. సినిమాని ఆపకండి. ఇదివరకు బాహుబలి మొదటి పార్ట్ ని ఆదరించినట్లు.. రెండో పార్ట్ ని ఆదరిస్తారని కోరుకుంటున్నా. ధన్యవాదాలు” అని కన్నడ ప్రజలకు జక్కన్న కన్నడలో విన్నవించారు. ఇప్పటికైనా కర్ణాటకలో  బాహుబలి రిలీజ్ కష్టాలు తొలిగి పోతాయని ఆశిద్దాం.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus