Rajamouli,Jr NTR, Prabhas: ప్రభాస్, ఎన్టీఆర్ మధ్య పోలిక ఇదే!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను సైతం రాజమౌళి మీడియాతో పంచుకుంటున్నారు. జక్కన్న తన సినీ కెరీర్ లో ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లతో సినిమాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. రాజమౌళి ఏం మాట్లాడినా ఆ మాటల గురించి చర్చ జరుగుతుంది.

సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండని ఈ స్టార్ డైరెక్టర్ సినిమా ప్రమోషన్స్ సమయంలో మాత్రం తన మాటల ద్వారా సినిమాలపై అంచనాలను పెంచేస్తారు. ఏం మాట్లాడినా పూర్తి అవగాహనతో మాట్లాడే డైరెక్టర్ గా రాజమౌళికి పేరుంది. చెన్నైలో జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జక్కన్న ప్రభాస్ కు ఎన్టీఆర్ కు ఒక విషయంలో పోలికలు ఉన్నాయని వెల్లడించారు. ఫుడ్ విషయంలో వాళ్లిద్దరూ సేమ్ టు సేమ్ అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

ఫుడ్ అంటే ప్రభాస్ కు చాలా ఇష్టమనే సంగతి తెలిసిందే. తను తినడంతో పాటు తన సినిమాలకు పని చేసే హీరోయిన్లకు, టెక్నీషియన్లకు తన ఇంట్లో తయారైన ఫుడ్ అందాల్సిందే. మరోవైపు ఎన్టీఆర్ కూడా ఆహారాన్ని ఆస్వాదిస్తారని జక్కన్న తెలిపారు. రకరకాల ఆహారాలను ఎన్టీఆర్ ట్రై చేస్తూ ఉంటారని జక్కన్న పేర్కొన్నారు. ఎన్టీఆర్ కు తినడం మాత్రమే కాక వండటం కూడా బాగా వచ్చని జక్కన్న వెల్లడించారు.

అందరి కంటే ముందు తారక్ సెట్స్ కు వస్తాడని జక్కన్న చెప్పుకొచ్చారు. మరోవైపు మరో 9 రోజుల్లో థియేటర్లలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో దాదాపుగా మార్పు లేనట్టేనని బోగట్టా. అయితే తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు వస్తే ఎలా అని నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు రికార్డు స్థాయిలో ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం గమనార్హం.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus