Rajamouli, Prabhas: ప్రభాస్ గొప్పదనం చెప్పేసిన జక్కన్న!

స్టార్ హీరో ప్రభాస్ ను అభిమానించే డైరెక్టర్లు ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. ప్రభాస్ తో ఒక్కసారి కలిసి పని చేస్తే మళ్లీమళ్లీ ప్రభాస్ తో సినిమా చేయాలని కోరుకుంటున్న డైరెక్టర్ల సంఖ్య ఎక్కువ మొత్తంలో ఉండటం గమనార్హం. ఈ ఏడాది ప్రభాస్ నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోయినా వచ్చే ఏడాది ప్రభాస్ నటించిన మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే నిర్మాతలు డబ్బులు ఇస్తామంటే స్టార్ హీరో ప్రభాస్ వద్దన్నారని సమాచారం.

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఒక సందర్భంలో మాట్లాడుతూ ప్రభాస్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బాహుబలి సిరీస్ పూర్తవుతున్న సమయంలో నిర్మాతలు ప్రభాస్ కు కాల్ చేసి ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పారు. అయితే ప్రభాస్ వెంటనే రాజమౌళికి కాల్ చేసి ఎక్స్‌ట్రా రెమ్యునరేషన్ తీసుకోవాలా..? వద్దా..? అని అడిగారు. ఆ సమయంలో తాను ఎక్కువ ఇస్తానంటే తీసుకోమని చెప్పానని జక్కన్న చెప్పుకొచ్చారు. అయితే ప్రభాస్ మాత్రం సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ మొత్తం ఖర్చైందని నిర్మాతల శ్రేయస్సు గురించి ఆలోచించారని జక్కన్న తెలిపారు.

 

ప్రభాస్ వ్యక్తిత్వం ఎంత మంచిదో జక్కన్న ఈ విధంగా వెల్లడించారు. రాధేశ్యామ్ సినిమా రిలీజ్ డేట్ ను సంక్రాంతికి ఫిక్స్ చేసిన ప్రభాస్ సమ్మర్ లో సలార్ సినిమాతో ఆగష్టు నెలలో ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూడు సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలే కాగా ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబో మూవీ షూటింగ్ త్వరలో మొదలు కానుంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus