Rajamouli, Pawan Kalyan, Mahesh Babu: పవన్ సినిమా వెనక్కి.. వారికి థాంక్స్ చెప్పిన జక్కన్న!

పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. జనవరి 12న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు ఫిబ్రవరి 25కి వాయిదా పడింది. ఈ సంక్రాంతికి పాన్ ఇండియా సినిమాలు ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ విడుదలవుతున్నాయి. దీంతో థియేటర్లకు సంబంధించి ఇబ్బందులు కలగకూడదని ‘భీమ్లానాయక్’ సినిమాను నిర్మాతల గిల్డ్ అభ్యర్ధన మేరకు వాయిదా వేశారు. ఈ నిర్ణయంపై దర్శకుడు రాజమౌళి స్పందించారు. ఈ విషయంలో ముగ్గురిని థాంక్స్ చెప్పారాయన.

పండగ నుంచి తప్పుకోవాలని ఆలోచనకు శ్రీకారం చుట్టిన మహేష్ బాబుకి ముందుగా కృతజ్ఞతలు చెప్పారు. ‘సర్కారు వారి పాట’ సినిమా పెర్ఫెక్ట్ పొంగల్ సినిమా అయినప్పటికీ.. సమ్మర్ కి ప్లాన్ చేసుకొని ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించారని మహేష్ పై, మైత్రి మూవీ మేకర్స్ పై పొగడ్తలు కురిపించారు రాజమౌళి. అలానే తమ సినిమా విడుదలను మార్చినందుకు దిల్ రాజు గారికి ‘ఎఫ్ 3’ సినిమా టీమ్ కి ధన్యవాదాలు చెప్పారు.

‘భీమ్లానాయక్’ సినిమా విడుదల తేదీని వాయిదా వేయాలని చినబాబు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం అభినందనీయమని.. టీమ్ అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ విషయానికొస్తే.. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా నటించిన ఈ సినిమాను 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కొమరం భీంగా తారక్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించనున్నారు. చరణ్ కి జోడిగా బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ నటించగా, తారక్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ కనిపించనుంది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus