Rajamouli: ఆ సెంటిమెంట్ ను కొరటాల తిరగరాస్తారా?

ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లను ఫాలో అయ్యే వాళ్లు ఎక్కువగా ఉంటారనే సంగతి తెలిసిందే. కొంతమంది డైరెక్టర్లు టైటిల్, హీరోయిన్ల విషయంలో, షూటింగ్ జరిపే ప్రదేశాల విషయంలో సెంటిమెంట్ ను ఫాలో అవుతుంటారు. అయితే ఇండస్ట్రీలో రాజమౌళి సినిమాలో నటించిన హీరోల తరువాత సినిమా ఫ్లాప్ లేదా డిజాస్టర్ అవుతుందనే బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్నారు.

ఎన్టీఆర్ తరువాత సినిమాకు కొరటాల శివ, చరణ్ తరువాత సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్న నేపథ్యంలో ఈ డైరెక్టర్లు ఫ్లాప్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారో లేదో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ మాత్రం కొరటాల శివ, శంకర్ సెంటిమెంట్ ను తిరగరాస్తారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శంకర్, కొరటాల శివ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లను ఎంచుకోవడంతో పాటు యూనివర్సల్ సబ్జెక్ట్ లతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. రాజమౌళి తర్వాత ఇండస్ట్రీలో అపజయమెరుగని డైరెక్టర్ గా కొరటాల శివ పేరును సంపాదించుకున్నారు.

ఇప్పటివరకు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు అనే సంగతి తెలిసిందే. అయితే శంకర్ మాత్రం ఈ మధ్య కాలంలో తెరకెక్కించిన సినిమాలు హిట్ టాక్ వచ్చినా కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలుస్తున్నాయి. శంకర్, కొరటాల శివ రాజమౌళి సెంటిమెంట్ రాంగ్ అని ప్రూవ్ చేస్తారేమో చూడాల్సి ఉంది. శంకర్, కొరటాల శివ తరువాత సినిమాల స్క్రిప్ట్ పనులను ఇప్పటికే పూర్తి చేశారని తెలుస్తోంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus