Rajamouli, NTR: వైరల్ అవుతున్న రాజమౌళి షాకింగ్ కామెంట్స్!

స్టార్ డైరెక్టర్ రాజమౌళి స్టార్ హీరో ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలన్నీ అంచనాలకు మించి సక్సెస్ ను సొంతం చేసుకున్నాయనే సంగతి తెలిసిందే. తారక్, రాజమౌళి కెరీర్ తొలినాళ్లలో ఒకరికొకరు సహాయం చేసుకుని విజయాలను అందుకున్నారు. ఇప్పటికీ ఈ కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎంతగానో ఆనందం కలుగుతుంది. తారక్ తో కలిసి పని చేయడానికి జక్కన్న తెగ ఆసక్తి చూపుతారు. రాజమౌళికి ఇతర హీరోలతో కూడా అనుబంధం ఉన్నా ఆయా హీరోలతో తారక్ తో ఉన్న స్థాయిలో మాత్రం అనుబంధం లేదనే సంగతి తెలిసిందే.

తాజాగా రాజమౌళి తారక్ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేయగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టుకతోనే నటుడు అని ఆయన కామెంట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గ్రాస్పింగ్ పవర్ ఊహించని స్థాయిలో ఉంటుందని రాజమౌళి తెలిపారు. తారక్ ను డైరెక్ట్ చేస్తున్న సమయంలో డైరెక్టర్ కు కూడా గొప్పగా ఉంటుందని జక్కన్న చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ ట్రాన్స్ ఫార్మర్ అంటూ జక్కన్న చేసిన కామెంట్లు అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగిస్తున్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా తారక్ జక్కన్న లాంటి బాండింగ్ ఎవరి మధ్య లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎంతోమంది హీరోలకు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపును తెచ్చిపెట్టిన జక్కన్న మహేష్ తో తెరకెక్కించే సినిమా ద్వారా మహేష్ కు కూడా పాన్ ఇండియా హిట్ ను అందించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మహేష్ రాజమౌళి కాంబో మూవీ వచ్చే ఏడాది సెకండాఫ్ లో మొదలు కానుంది. 700 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. మహేష్ రాజమౌళి కాంబో సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని వివరాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus