జక్కన్నకి ఇన్ని ఆలోచనలు ఉన్నాయా ?

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకుడుకంటే ముందు సినిమాకి వీరాభిమాని. తెలుగులో టాప్ దర్శకుడైనప్పటికీ ప్రతి సినిమాని చూస్తారు. వెంటనే తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంటారు. ఇక మహానటి సినిమా చిత్ర యూనిట్ సన్మాన కార్యక్రమంలో పాల్గొని అభినందనలు గుప్పించారు. ఇదంతా బాగానే ఉంది.. ఈ సన్మానంలో రాజమౌళి మాటలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అక్కడ ఏమి మాట్లాడారంటే.. ” ఈ సినిమా నిర్మాతలు అయిన అశ్వినీదత్ కుమార్తెలకు సన్మానం చేయాలి.  అంతేకాదు ఇలాంటి గొప్ప సినిమాను నేను ఎందుకు తీయలేకపోయానా అన్న బాధకలుగుతోంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మాటల వెనుక ఎంతో బాధ ఉందని రాజమౌళి అభిమానులు చెబుతున్నారు. మహానటి చిత్రానికి చిరంజీవి నుంచి అనేక మంది ఉచితంగా పబ్లిసిటీ చేస్తున్నారు. సన్మానాలతో బూస్ట్ ఇస్తున్నారు. ఇలా బాహుబలి సినిమాకి ఎవరూ ముందుకు రాకపోవడం జక్కన్నని తొలిచివేస్తోంది. ఇక మహానటి చూసిన వారందరూ నాగ్ అశ్విన్ కి  జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకుడు అవార్డు వస్తుందని, రావాలని కోరుతున్నారు. కానీ బాహుబలి కోసం ఐదేళ్లు కష్టపడినా రాజమౌళి కి జాతీయ స్థాయిలో అవార్డు రాలేదు.  ఇది మరింత మనసును మెలిపెడుతోందని భావిస్తున్నారు. ఇలా రాజమౌళి ఆలోచిస్తున్నారా లేదో తెలియదు కానీ అతని మాటలను ఫ్యాన్స్ మరోలా అర్ధం చేసుకొని చాలా ఫీల్ అవుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus