ఈ మాట అన్నది ఎవరో కాదండి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గర్వించ దగ్గ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి కుమారుడు ఎస్ ఎస్ కార్తికేయ. అతను ఇప్పటి వరకు తండ్రి సినిమాలకు పనిచేసాడు. ఈగ, బాహుబలి సినిమాలకు ప్రోమో, టీజర్ లను కట్ చేసాడు. తాను సెట్స్ లో పని చేస్తూనే సొంతగా “షోయింగ్ బిజినెస్” ను ప్రారంభిచాడు. ఈ కంపనీ సినిమాలకు బిహైండ్ సీన్స్, మేకింగ్ వీడియోస్ ను రూపొందిస్తుంది. మనం, దిక్కులు చూడకు రామయ్య, ఒక లైలా కోసం, ఊహలు గుసగుసలాడే, లింగ సినిమాలకు బిహైండ్ సీన్స్, మేకింగ్ వీడియోస్ లతో పాటు టీజర్ లను కట్ చేసి అందించింది.
కార్తికేయను రాజమౌళి కెరీర్ ఎంపికలో ఒత్తిడి తీసుకు రాలేదు. సెట్స్ లో కూడా ఒక టెక్నిషియన్ గా మాత్రమే చూసారు. ఇంటి దగ్గర కార్తి అని ముద్దుగా పిలుచుకున్నా సెట్ లో కార్తికేయ అని పిలుస్తారు. కార్తికేయ కూడా నాన్న పేరు చెప్పుకుని ఎదగాలని అనుకోవడం లేదు. హీరోగా పరిచయం అయ్యే అవకాశం ఉన్నా డైరెక్టర్ గా తాను ఏమిటో నిరూపించుకోవాలని చూస్తున్నాడు. అందుకే అన్ని విభాగాల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.
కార్తికేయ బాహుబలి కంక్లూజన్ సినిమాకు తీరికలేకుండా పని చేస్తూనే మంచి స్టొరీని రెడీ చేసుకున్నాడు.
ఆ కథను ఎన్టీఆర్ కు వినిపించినట్లు, అతను ఓకే చెప్పినట్లు ప్రచారం మొదలయింది. ఇది కార్తికేయ వరకు వెళ్ళింది. దీంతో అతను “వావ్… నా ఫైన రూమర్స్ మిమ్మల్ని కూడా ఆత్రుత పడేలా చేసిందని ” శుక్రవారం పోస్ట్ చేసారు.
Wow! Some rumours get you excited too! https://t.co/t0A9A7pCKm
— S.S.Karthikeya (@ssk1122) May 13, 2016