Rajamouli: స్టార్ ప్రొడ్యూసర్ గా మారబోతున్న రాజమౌళి.. కానీ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న రాజమౌళి ఇకపై తన సినిమాలను తనే నిర్మించుకోనున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. రాజమౌళి మహేష్ కాంబో మూవీ కేఎల్ నారాయణ నిర్మాతగా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమాలు సొంత బ్యానర్ లో తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని బోగట్టా. రాజమౌళి ప్రస్తుతం సినిమాలకు రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా తీసుకుంటున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళికి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. రాజమౌళితో సినిమా నిర్మిస్తే నిర్మాతకు సులువుగా 200 కోట్ల రూపాయల రేంజ్ లో లాభాలు వస్తున్నాయి. ఈ రీజన్ వల్ల జక్కన్న తన సినిమాలను తనే నిర్మించుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. ప్రొడక్షన్ విషయంలో సపోర్ట్ కావాలంటే రాజమౌళి బంధువులలో ఎంతోమందికి అనుభవం ఉంది. ఇప్పటివరకు తీసుకున్న అడ్వాన్స్ లకు సంబంధించిన సినిమాలను దాదాపుగా పూర్తి చేసిన రాజమౌళి

కొత్తగా అడ్వాన్స్ లను తీసుకోవాలని భావించడం లేదని తెలుస్తోంది. ఫండింగ్ కు సమస్య లేకపోవడంతో రాజమౌళి ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం అందుతోంది. రాజమౌళి సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నాయి. మహేష్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం రాజమౌళి 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. 700 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. విదేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరగనుండగా రాజమౌళి ఇప్పటికే లొకేషన్లను ఫైనల్ చేశారు.

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూట్ పూర్తైన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ షూట్ మొదలుకాకముందే ఈ సినిమాకు క్రేజీ ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. ఈ సినిమాకు 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బిజినెస్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus