మగధీర చిత్రంతో వెండితెరపై అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించగల దర్శకధీరుడు టాలీవుడ్లో ఒకడు వచ్చాడని రాజమౌళి గుర్తింపు పొందారు. ఈగ మూవీతో జక్కన్న ప్రతిభ పక్క రాష్ట్రాలకు తెలిసింది. బాహుబలితో రాజమౌళి పేరు దేశవ్యాప్తంగాపాకింది. బాహుబలి హిందీ వెర్షన్ 50 కోట్ల పైన లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో అక్కడి నిర్మాతలు భారీ ఆఫర్లతో అయన ముందు వాలారు. కానీ బాహుబలి రెండో పార్ట్ ఉండడంతో వాటి అన్నింటినీ పక్కన పెట్టారు. బాహుబలి కంక్లూజన్ ఏప్రిల్ 28 న రిలీజ్ కాబోతోంది. నెక్స్ట్ ఏ చిత్రానికి జక్కన్న సైన్ చేయలేదు. ఎందుకో కారణం ఇప్పుడు తెలిసింది.
బాహుబలి 2 ప్రచారంలో భాగంగా ఢిల్లీలో జాతీయ స్థాయి మీడియాతో మాట్లాడుతూ.. వారు అడిగిన “మీ బాలీవుడ్ ప్రవేశం ఎప్పుడు” అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పారు. బాహుబలి తరవాత డైరక్ట్ హిందీ మూవీ చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే కథ, స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిందని, బాహుబలి రిలీజ్ తర్వాత ఆ వివరాలను వెల్లడిస్తాననని స్పష్టం చేశారు. సో రాజమౌళి బాలీవుడ్ ఎంట్రీ ఖరారైపోయింది. మరి హీరో ఎవరు? ఎటువంటి కథ అనేది తెలుసుకోవడానికి అభిమానుల తపన మొదలయింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.