దర్శక ధీరుడు రాజమౌళి మొదటి నుంచి తాను ఏ ప్రాజెక్ట్ చేపట్టినా పక్కా ప్లానింగ్ తో రంగంలోకి దిగడం ఆయన స్పెషాలిటీ. అసలు ఆయన చేసే పబ్లిసిటీ వేరే లెవెల్ లో ఉంటుంది. అయితే అందరు దర్శకులు టీజర్ లు , ట్రైలర్లు మరియు సాంగ్స్ ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేసి, సినిమాకు బజ్ ని క్రియేట్ చేయటానికి ప్రయత్నిస్తారు. కథ ఏంటి అనేది మాత్రం రివీల్ కాకుండా జాగ్రత్త పడతారు. కానీ రాజమౌళి మాత్రం డిఫరెంట్ గా , తాను తీయబోయే సినిమాలోని మూల కథను ముందే ఆడియన్స్ కి చెప్పేస్తాడు.
దాదాపుగా ఇదే పంధాను కొనసాగిస్తూ తన మూవీస్ తో పాన్ ఇండియా దర్శకుడిగా ఎదిగాడు రాజమౌళి. ఎన్టీఆర్ & రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన RRR వంటి ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే దీని తరువాత రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న సినిమా SSMB 29 ( టైటిల్ ఇంకా ప్రకటించలేదు). ఈ మూవీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా , ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు . ఈ చిత్రం లో మలయాళ నటుడు పృథ్వి రాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేయగా , MM కీరవాణి మ్యూజిక్ ను అందిస్తున్నారు. K L నారాయణ ప్రొడక్షన్ లో సుమారు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. SSMB 29 గురించిన లాంచింగ్ ఈవెంట్ ఈ నెల నవంబర్ 15 న జరగనున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్ లో రాజమౌళి ఎప్పటిలాగే తాను తీయబోయే కథను మొత్తం రివీల్ చేయనున్నట్లు తెలుస్తుంది. దీని కొరకు ఆయన 3 నిమిషాల వీడియో ను కూడా రెడీ చేసినట్లు ఒక వార్త చక్కర్లు కొడుతోంది. దీని గురించి క్లారిటీ రావాలంటే నవంబర్ 15 వరకు వెయిట్ చేయాల్సిందే.!