స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి 1840 లో బ్రిటిష్ వారికి ఎదురు నిలిచి పోరాడి వీరమరణం పొందారు. అంతటి వీరుడి జీవిత గాథలో మెగాస్టార్ చిరంజీవి నటించడానికి సిద్ధమవుతున్నారు. చిరు గుర్రపు స్వారీ, కత్తి యుద్ధాలపై దృష్టి పెట్టారు. మెగాస్టార్ ఓ వైపు తనని తాను మార్చుకోవడమే కాదు స్టోరీని ఇంట్రెస్టింగ్ గా మలచడానికి ప్రయత్నిస్తున్నారు. స్టైలిష్ డైరక్టర్ సురేందర్ రెడ్డి, ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ స్టోరీ ని అద్భుతంగా రాశారు. యువ రచయితలు కూడా స్క్రిప్ట్ వర్క్ లో పాలుపంచుకుంటున్నారు. తాజాగా ఉయ్యాలవాడ బృందంలో రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ జాయిన్ అయ్యారని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే వీరిద్దరూ రాస్తున్నట్లు తెలిసింది.
సినిమా టైటిల్ కార్డు లోకూడా రాజమౌళి పేరు వేయడానికి నిర్మాత రామ్ చరణ్ సమ్మతి తెలిపినట్లు సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ ను సంగీత దర్శకుడిగా పనిచేయనుండగా, హీరోయిన్ గా సోనాక్షి సిన్హా పేరు వినిపిస్తోంది. గ్రాఫిక్స్ కోసం ఏకంగా జాతీయ అవార్డు గ్రహీత కమల్ కన్నన్ ను రంగంలోకి దించారు. ఇలా టాప్ టెక్నీషియన్స్, బాలీవుడ్ నటీ నటులతో తెరకెక్కనున్న ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.