Boyapati Srinu: ఆ హీరో ప్రశాంత్‌ వర్మని ఓకే చేయలేదు.. ఇప్పుడు బోయపాటికి యస్‌ చెబుతాడా?

తెలుగు దర్శకులు బాలీవుడ్‌కి వెళ్లి వరుస సినిమాలు చేయడం లేదు కానీ.. వెళ్లినప్పుడు మాత్రం సాలిడ్ ఇంపాక్ట్‌ చూపించి అయితే వస్తున్నారు. దీనికి ఉదాహరణలుగా చాలామంది పేర్లు చెప్పొచ్చు. రీసెంట్‌గా ఇలాంటి ప్రయత్నం చేసి, తొలి స్టెప్పే ఇండస్ట్రీ హిట్‌ రికార్డు అందుకున్న గోపీచంద్‌ మలినేని ‘జాట్‌’ సినిమాతో అదరగొట్టారాయన. ఆ తర్వాత చాలామంది దర్శకులు ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నా ఏదీ వర్కవుట్‌ కావడం లేదు. మొదలవుతుంది, మొదలైంది అని టాక్‌ వచ్చిన సినిమాలు ముందుకెళ్లడం లేదు. ఈ క్రమంలో మరో టాలీవుడ్ దర్శకుడు బాలీవుడ్‌ ఆలోచన చేస్తున్నారనే వార్తలొస్తున్నాయి.

Boyapati Srinu

‘అఖండ 2: తాండవం’ సినిమా త‌ర‌వాత బోయ‌పాటి శ్రీ‌ను ఏం చేస్తారు అనేది పెద్ద క్వ‌శ్చ‌న్ మార్క్‌. అల్లు అర్జున్‌తో ఓ సినిమా ఉంటుందని వార్తలొచ్చినా బన్నీ అటు అట్లీ, ఇటు లోకేశ్‌ కనగరాజ్‌ సినిమాలతో బిజీ అయపోయాడు. దీంతో బోయపాటి నెక్స్ట్ హీరో బాలీవుడ్ నుండే రావాలని అనుకుంటున్నారని టాక్‌. ఈ క్రమంలో బాలీవుడ్‌ పవర్‌ హౌస్‌గా పేరు గాంచిన ‘దురంధర్‌’ రణ్‌వీర్‌ సింగ్‌ని బోయపాటి కలిసే ఉద్దేశంలో ఉన్నారని టాక్‌. మామూలూగా అయితే ఆయన ఇంగ్లిష్‌ మట్లాడితే అవతలి వ్యక్తికి ఇబ్బంది. మరి రణ్‌వీర్‌తో సినిమా కథ ఎలా చెప్పారు / చెబుతారు అనేది టాక్‌.

రణ్‌వీర్‌ తెలుగు దర్శకుడితో సినిమా చేయాలని చాలా ఏళ్లుగా అనుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా దాదాపు అనౌన్స్‌ చేశారు. లుక్ టెస్ట్ అయిపోయి, పోస్టర్‌ షూట్‌కి వెళ్లినప్పుడు ఆ సినిమా ఆగిపోయింది. సినిమా విషయంలో రణ్‌వీర్‌, ప్రశాంత్‌ మధ్య క్రియేటివ్‌ థాట్స్‌ దగ్గర అడ్డుపడిందని సమాచారం. మరిప్పుడు లాజిక్‌ లేని సీన్స్‌తో విరుచుకుపడే బోయపాటి – రణ్‌వీర్ కలిస్తే ఆ సినిమా మరో రకంగా ఉంటుంది. మరిప్పుడు బోయపాటి ఏం చెబుతారు, ఎలా చెబుతారు, ఎలా ఒప్పిస్తారో చూడాలి.

టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus