Rajamouli: జపాన్‌లో రాజమౌళి ఏం చేశారో చూశారా?

‘ఆర్‌ఆర్ఆర్‌’ ప్రమోషన్స్‌ కోసం రాజమౌళి, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ జపాన్‌లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి ఆసక్తికర అంశాలను ఫొటోలుగా సోషల్‌ మీడియలో పోస్ట్‌ చేస్తున్నారు టీమ్‌. ఇవి కాకుండా అక్కడి జనాలు మరికొన్ని వీడియోలు, పోస్ట్‌లు పెడుతున్నారు. దీంతో సోషల్‌ మీడియాలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ నాటి హంగామా కనిపిస్తోంది. ‘జపాన్‌లో మావోడి క్రేజ్‌ చూశారా’ అంటూ ఫ్యాన్స్‌ ఆ ఫొటోలను రీషేర్‌ చేస్తూ సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలో రాజమౌళికి సంబంధించి ఓ ఆసక్తికరమైన ఫొటో బయటకు వచ్చింది. ఆయన త్రీడీ ఫొటోలు తీస్తున్నట్లుగా ఆ ఫొటోలు చూస్తే అర్థమవుతోంది. అది కూడా జపాన్‌కు చెందిన ప్రముఖ వీడియో గేమ్‌ క్రియేటర్ హిడియో కొజిమా టీమ్‌ రాజమౌళి ఫొటోలు తీసింది. అంటే త్వరలో రాజమౌళి ప్రధానంగా ఓ వీడియో గేమ్‌ను చూడొచ్చు అనేది సోషల్‌ మీడియాలో చర్చ. లేదంటే ఏదైనా వీడియో గేమ్‌లో రాజమౌళి పాత్రను పెడతారు అనే మాట కూడా వినిపిస్తోంది.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాను జపాన్‌లో ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్ అక్కడ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఇంటర్వ్యూలు, ఫ్యాన్‌ మీట్‌లు పెట్టారు. ఇంకొన్ని రోజులు వీళ్లు అక్కడే ఉంటారు అని టాక్‌ నడుస్తోంది. ఈ విషయం పక్కనపెట్టి వీడియో గేమ్‌ గురించి చూస్తే.. “లెజెండరీ వీడియో గేమ్ క్రియేటర్ కొజిమాను కలవడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా వీడియో గేమ్ష్‌, సినిమాలతో పాటు మరికొన్ని విషయాల మాట్లాడాం’’ అని రాజమౌళి ట్వీట్ చేశారు.

మరోవైపు రాజమౌళిని కలవడం గురించి కొజిమా కూడా ట్వీట్‌ చేశారు. ఈ క్రమంలో రాజమౌళి ఇచ్చిన బహుమతుల ఫోటోలను కూడా షేర్ చేశారు. రాజమౌళి కోజిమా ప్రొడక్షన్స్ స్టూడియోను సందర్శించారు అని రాసుకొచ్చారు. దీంతోపాటు రాజమౌళి 3D చిత్రాలను తీస్తున్న కొన్ని ఫొటోలను షేర్‌ కూడా చేశారు. ఈ నేపథ్యంలో త్వరలోనే వీడియో గేమ్స్‌లో రాజమౌళి కనిపిస్తారని తెలుస్తోంది. మరి ఎప్పుడు, ఏంటి, ఎలా అనేది తెలియాల్సి ఉంది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus