ప్లాప్ అనే మాటకి ఏ మాత్రం భయపడని దర్శకుడు… ఎంత ప్రయోగాత్మక కథనైనా చేయడానికి ధైర్యంగా ముందుకొచ్చే హీరో… వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది. ఇదే ప్రశ్న పదేళ్ళకు పైనే ప్రేక్షకుల్లో ఉండిపోయింది. అదే మహేష్, రాజమౌళి కాంబినేషన్..! నిజానికి ‘పోకిరి’ సినిమా టైం నుండీ వీరిద్దరి సినిమా ఉంటుందని అనౌన్స్ చేసారు. ఇప్పటికి 10 ఏళ్ళు దాటేసింది.
అయినా ఇంకా…సినిమా మొదలుకాలేదు. ఈ గ్యాప్ లో ‘మగధీర’ ‘బాహుబలి’ (సిరీస్) కూడా వచ్చేసాయి. అయితే కచ్చితంగా మా కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అని రాజమౌళి, మహేష్ లు చెబుతున్నారు. దీంతో వీరి కాంబినేషన్ లో ఏ జోనర్ లో సినిమా వస్తే బాగుంటుంది అని ఓ ‘పోల్’ నిర్వహించారు. దానికి ‘హాలీవుడ్ రేంజ్ సైన్సు ఫిక్షన్’ మూవీ కావాలని ఎక్కువ మంది ఓటు వేశారు ప్రేక్షకులు. మరి రాజమౌళి, మహేష్ .. ల మనసులో ఏముందో..!