ప్రపంచవ్యాప్తంగా బాహుబలి బిగినింగ్ మూవీ 650 కోట్ల కలక్షన్స్ రాబట్టింది. ఈ రికార్డ్ ని బద్దలు కొట్టేందుకు తెలుగు సినిమాలు ప్రయత్నించి అలసిపోయాయి. తాను నెలకొల్పిన రికార్డును తానే బద్దలు కొట్టాలని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి బాహుబలి కంక్లూజన్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ అత్యధిక కలక్షన్స్ సాధించే అన్ని మార్గాలపై దృష్టిసారించారు. ఇప్పటికే విదేశాల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. మనదేశంలో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. అయితే కర్ణాటకలోనూ భారీ ఎత్తున విడుదల చేయాలనీ కొన్ని రోజులుగా జక్కన్న ప్రయత్నిస్తున్నారు. అక్కడ డబ్బింగ్ సినిమాలకు అనుమతిలేదు. తెలుగులోనే రిలీజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే అక్కడున్న తెలుగువారు మాత్రమే చూస్తారు.
మరీ కన్నడీయులు చూసేలా స్థానికత అనే సెంటిమెంట్ తో అక్కడి ప్రభుత్వాన్ని రాజమౌళి ఆకర్షించినట్లు తెలిసింది. దర్శకధీరుడు ఆంధ్రప్రదేశ్ లోని కొవ్వూరు లో పుట్టినా, చాలాకాలం కర్ణాటక ప్రాంతంలో పెరిగారు. ఆ అభిమానంతోనే అక్కడి ప్రభుత్వం పద్మశ్రీ ఇప్పించింది. ఇప్పుడు తన రూల్స్ కూడా మార్చుకోనుంది. డబ్బింగ్ సినిమాను ప్రదర్శించడానికి వీలు కల్పిస్తోంది. అది కేవలం బాహుబలి 2 చిత్రానికి మాత్రమనంట. ఎందుకంటే రాజమౌళి మనవ్యక్తి అందుకే అతని చిత్రానికి ఈ సడలింపు ఇస్తున్నామని రాజకీయులు, అధికారులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసి సినీ ప్రముఖులు రాజమౌళి ప్లాన్ సూపర్ అంటూ ప్రశంసిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.