Rajanikanth: వైరల్‌: అభిమాని కోసం ప్రత్యేక వీడియో పంపిన తలైవా

Advertisement

ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అంటే తెలియాలంటే… కొంత మంది గొప్పవాళ్లను చూడాలి. అలాంటి వారిలో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఒకరు. స్టార్‌ హీరో అయినా… ఎప్పుడూ ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటారు. అందుకే అభిమానులు సూపర్‌స్టార్‌ని తలైవా అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఎందుకు తనను అందరూ అంతగా ఓన్‌ చేసుకుంటారో మరోసారి చేసి చూపించారు రజనీకాంత్‌. తన అభిమాని కోసం ప్రత్యేకంగా ఓ వీడియోను సిద్ధం చేసి… తన కన్‌సర్న్‌ చూపించారు రజనీకాంత్‌. ఇప్పుడు ఆ వీడియో గురించి ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది.

ఆ వీడియోలో రజనీ చెప్పిన మాటలు, చూపించిన అభిమానం గురించే చర్చ అంతా. గత రెండు, మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో చూస్తే… ఓ వీడియో వైరల్‌ అవుతోంది. 30 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో రజనీకాంత్‌ ఓ వ్యక్తితో మాట్లాడుతున్నారు. జాగ్రత్తలు చెబుతూనే, ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఆ వీడియోలో రజనీకాంత్‌ ఏం చెప్పారంటే… ‘‘సౌమ్య… ఎలా ఉన్నావు. నువ్వు అస్సలు బాధపడకు. నువ్వు త్వరగా కోలుకుంటావు. నన్ను క్షమించు కన్నా, నిన్ను నేరుగా వచ్చి కలుద్దామని అనుకున్నాను.

కానీ కరోనా కారణంగా బయటకు రాలేకపోతున్నాను. దాంతోపాటు నా ఆరోగ్యం కూడా కాస్త ఇబ్బందిపెడుతోంది. అందుకే రాలేకపోయాను. లేకపోతే కచ్చితంగా వచ్చేవాణ్ని. నువ్వు ధైర్యంగా ఉండు. ఆ దేవుడు ఉన్నాడు… నీ కోసం నేను కూడా ప్రార్థిస్తాను. చూడు ఎంత అందంగా నవ్వుతున్నావో. ఆందోళనపడకు నాన్నా. నీ ఆరోగ్యం కుదుట పడుతుంది’’ అని వీడియోలో చెప్పారు రజనీకాంత్‌.ఇక ఆ సౌమ్య అనేది ఎవరు అనే విషయమై కూడా కాస్త సమాచారం తెలుస్తోంది. సౌమ్యది బెంగళూరు.

కొన్ని రోజుల క్రితం అనారోగ్యం పాలైంది. ఆమె రజనీకాంత్‌ అభిమానురాలు. ఈ విషయం తెలుసుకున్న రజనీకాంత్‌ అభిమానులు ఆయన దృష్టికి తీసుకెళ్లారట. దాంతో రజనీకాంత్‌ వీడియో బైట్‌ తీసి పంపించారట. ఆ వీడియోనే ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ వీడియోను చూసి, రజనీకాంత్‌ అభిమానులు చాలా ఆనందపడుతున్నారు. అభిమాని కోసం తలైవా చేసిన పనికి వావ్‌ అంటున్నారు. ఇలాంటి వీడియోలు గతంలో కొంతమంది హీరోలు కూడా ఇలాంటి వీడియోలు చేసి అభిమానులను ఖుష్‌ చేశారు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus