టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలకు సమానంగా ఒకప్పుడు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న రజనీకాంత్ మార్కెట్ తెలుగులో గత కొన్నేళ్లలో తగ్గిందనే సంగతి తెలిసిందే. రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా తెలుగు హక్కులు తక్కువ మొత్తానికే అమ్ముడయ్యాయని తెలుస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ డైరెక్టర్ గత సినిమా బీస్ట్ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. అయితే బీస్ట్ సినిమా కథకు, జైలర్ సినిమా కథకు పోలికలు ఉన్నాయని కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
బీస్ట్ సినిమాలో షాపింగ్ మాల్ లో ఉన్న హీరో శత్రువుల నుంచి రక్షిస్తే జైలర్ సినిమాలో జైలులో ఉన్న ఖైదీల నుంచి ఎదురైన సమస్యను రజనీకాంత్ చాకచక్యంగా పరిష్కరిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని సమాచారం అందుతోంది. జైలర్ సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండగా ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. రజనీకాంత్ కు ఈ సినిమాతో పూర్వ వైభవం వస్తుందేమో చూడాలి.
తెలుగులో భోళా శంకర్ సినిమా రిలీజవుతున్న సమయంలోనే జైలర్ సినిమా విడుదలవుతూ ఉండటం గమనార్హం. ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం అందుతోంది. అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన జైలర్ సినిమా పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని సమాచారం అందుతోంది.
జైలర్ (Jailer) సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. జైలర్ సినిమాకు తమిళంలో మాత్రం భారీ స్థాయిలో బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఏడు పదుల వయస్సులో కూడా వరుస సినిమాలలో నటిస్తూ రజనీకాంత్ సత్తా చాటుతున్నారు.
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!
సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు