Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » ప్రపంచవ్యాప్తంగా జూన్ చివరి వారం లో రాజశేఖర్ ‘కల్కి’ విడుదల!

ప్రపంచవ్యాప్తంగా జూన్ చివరి వారం లో రాజశేఖర్ ‘కల్కి’ విడుదల!

  • June 10, 2019 / 11:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రపంచవ్యాప్తంగా జూన్ చివరి వారం లో రాజశేఖర్ ‘కల్కి’ విడుదల!

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘కల్కి’. తెలుగు ప్రేక్షకులకు ‘అ!’ వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రాన్ని అందించిన ప్రశాంత్ వర్మ దర్శకుడు. శివానీ శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ 28న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజశేఖర్, స్కార్లెట్ విల్సన్ పై చిత్రీకరించిన ‘హార్న్ ఓకే’ పాటను బుధవారం రెడ్ ఎఫ్.ఎమ్ ఛానల్ లో విడుదల చేయనున్నారు. లలిత కావ్య పాడిన ఈ పాటను కేకే రాశారు. ‘మధుర’ మ్యూజిక్ ద్వారా ఈ సినిమా పాటలు విడుదల కానున్నాయి.

rajasekhar-kalki-movie-release-date-fixed4

  • కైలాసపురం వెబ్ సిరీస్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • కిల్లర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • హిప్పీ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • సెవెన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

rajasekhar-kalki-movie-release-date-fixed1

ఈ సందర్భంగా నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ “పక్కా కమర్షియల్ చిత్రమిది. కొత్త తరహాలో ఉంటుంది. ఇప్పటికే విడుదలైన కమర్షియల్ ట్రైలర్, టీజర్‌కు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ లభించింది. సినిమా కూడా ప్రేక్షకులను అదే విధంగా ఆకట్టుకుంటుంది. త్వరలో పాటల్ని విడుదల చేసి, ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తాం. శ్రవణ్ భరద్వాజ్ అద్భుతమైన బాణీలను అందించాడు. నేపథ్య సంగీతం కూడా బాగా చేస్తున్నాడు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు.

rajasekhar-kalki-movie-release-date-fixed2

జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ “డిఫరెంట్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ సినిమా ‘కల్కి’. ప్రేక్షకులు అందరినీ అలరిస్తుంది. కమర్షియల్ ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ఫోన్లు చేసి తమకు ట్రైలర్ ఎంత నచ్చిందో చెప్పారు. సోషల్ మీడియాలోనూ, యూట్యూబ్‌లోనూ టాప్ ట్రెండ్స్ లో నిలిచింది. రాజశేఖర్ గారి ఇమేజ్‌కి త‌గ్గ విధంగా, కొత్త తర‌హా క‌మ‌ర్షియ‌ల్ సినిమాను ప్రశాంత్ వర్మ తీశారు. ఆయన కథ, దర్శకత్వం సినిమాకు హైలైట్ అవుతాయి” అని అన్నారు.

rajasekhar-kalki-movie-release-date-fixed3

దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ “ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఎంత ఉత్కంఠ కలిగిస్తుందో… థియేటర్లలో ప్రేక్షకులకు ‘కల్కి’ అంత ఉత్కంఠ కలిగిస్తుంది. త్వరలో థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తాం. నిర్మాత సి. కళ్యాణ్ గారు ఖర్చుకు వెనకాడకుండా చిత్రాన్ని నిర్మించారు” అని అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adah Sharma
  • #C.kalyan
  • #Dr.Rajasekhar
  • #Kalki
  • #Nanditha Swetha

Also Read

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

related news

trending news

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

4 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

4 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

5 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

5 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

6 hours ago

latest news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

1 hour ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

2 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

3 hours ago
Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

6 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version