నటన వైపు మొగ్గుచూపుతున్న రాజశేఖర్ చిన్న కూతురు

జీవిత, రాజశేఖర్ ల పెద్ద కుమార్తె శివాని హీరోయిన్ గా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. హిందీ హిట్ ‘టూ స్టేట్స్’ రీమేక్‌గా రూపొందుతోన్న తెలుగు సినిమాతో శివానీ ఎంట్రీ ఇవ్వనుంది. అడవి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా సెట్స్ మీద ఉంది. ఈ మూవీ కంప్లీట్ కాకముందే శివానీ మరో రెండు సినిమాలకు సంతకం చేసింది. కోలీవుడ్‌లో విష్ణు విశాల్ సరసన హీరోయిన్‌గా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పింది. ఆమె క్రేజ్ ని దగ్గరుండి చూసిన చెల్లెలు శివాత్మిక కూడా హీరోయిన్ అవ్వాలని కలలుకంటోంది. ఈ విషయాన్ని ఆమె తల్లి జీవిత రాజశేఖర్ తాజాగా చెప్పారు. అక్క బాటలోనే శివాత్మిక కూడా సినిమాల్లోకి వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తోందని వెల్లడించారు.

నిజానికి శివాత్మికను విద్యారంగంలో కొనసాగించాలని రాజశేఖర్ భావించారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఓ స్కూల్ ఏర్పాటుచేసి, ఆ బాధ్యతల్ని శివాత్మికకు అప్పగించాలని అనుకున్నారు. మొదట శివాత్మిక కూడా కూడా ఆ దిశగా ఆసక్తి కనబరిచినప్పటికీ.. అక్కను చూసి తను కూడా హీరోయిన్ అవ్వాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. శివాత్మిక ఎంట్రీపై ఇప్పుడే అధికారికంగా ప్రకటించడానికి రాజశేఖర్ దంపతులు సిద్ధంగా లేరు. కమర్షియల్ హీరోయిన్ ఎలా అయితే ఉండాలో.. అన్ని విధాలుగా శిక్షణ ఇచ్చిన తర్వాత, మేకోవర్ పూర్తి అయినా తర్వాత, మంచి కాంబినేషన్ సెట్ సెట్ అయినప్పుడు ప్రకటించవచ్చు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus