టాలీవుడ్ ఇండస్ట్రీలో సుదీర్ఘకాలం కెరీర్ ను కొనసాగించిన నటులలో రాజీవ్ కనకాల (Rajiv Kanakala) ఒకరు. రాజీవ్ కనకాల తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సెలబ్రిటీలపై ట్రోల్స్ చేయడానికి ఒక లిమిట్ ఉంటుందని ఆ లిమిట్ దాటి ప్రవర్తించవద్దని చెప్పుకొచ్చారు. ఒక యూట్యూబ్ ఛానల్ కు గతంలో నేను ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో ఒకానొక దశలో నాన్న సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడని చెప్పానని రాజీవ్ తెలిపారు. నేను ఇంటర్వ్యూ ఇచ్చిన ఛానల్ అనుబంధ ఛానల్ మాత్రం “సూసైడ్ చేసుకుని చనిపోయిన దేవదాస్ కనకాల” అని థంబ్ పెట్టారని రాజీవ్ పేర్కొన్నారు.
ఆ థంబ్ చూసిన వెంటనే నాకు కోపం వచ్చి నేను ఇంటర్వ్యూ ఇచ్చిన వ్యక్తికి ఫోన్ చేయగా ఆ వ్యక్తి థంబ్ మార్పించారని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు. యూట్యూబ్ థంబ్ నెయిల్స్ వల్ల చాలామంది నేను, సుమ (Suma Kanakala) విడాకులు తీసుకున్నామని భావించారని రాజీవ్ కనకాల పేర్కొన్నారు. ఒక షోకు మేమిద్దరం వెళ్తే “విడాకులు తీసుకున్నారు కదా.. మళ్లీ కలిసిపోయారా” అంటూ కామెంట్లు వచ్చాయని రాజీవ్ అన్నారు.
ఒకానొక సమయంలో నా కూతురుపై కూడా ట్రోల్స్ చేశారని నా కూతురు ఒక ఫంక్షన్ కు వెళ్తే లేనిపోని వార్తలు రాసి నా కూతురు బాధ పడేలా చేశారని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు. రాజీవ్ కనకాల వెల్లడించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దయచేసి ఫేక్ వార్తలు రాయవద్దని రాజీవ్ కనకాల స్పందించడం గమనార్హం.
ఇతర భాషల్లో సైతం రాజీవ్ కనకాలకు మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. రాజీవ్ కనకాల పారితోషికం ఒకింత భారీ స్థాయిలోనే ఉందని సమాచారం అందుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొంతమంది హీరోలతో రాజీవ్ కనకాల స్నేహ బంధం కొనసాగుతోంది. రాజీవ్ యాక్టింగ్ స్కిల్స్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.