Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్‌… ఆ మాటకు రెండు అర్థాలు.. కానీ ఎందుకు వాడటం?

నోరు జారాను.. క్షమించండి.. ఈ మాట ఎప్పుడో ఒకసారి అంటే బాగుంటుంది. దానికి ఎదుటివాళ్లు, బయటివాళ్లు ఓకే కూడా అనుకుంటారు. ఇదే మాట ప్రతి నెలా ఒకసారి అంటుంటే ఎలా ఉంటుంది. అది కూడా ప్రతి నెలా కొత్త రకాలు నోరు జారుతూ. చాలా బాగోదు కదా. ఇప్పుడు ఇలాంటి పనే చేస్తున్నారు ప్రముఖ సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌. సినిమా ఈవెంట్లకు రావడం, అక్కడకు వచ్చిన ఇతర గెస్టుల గురించి ఇబ్బందికరంగా మాట్లాడటం చాలా ఏళ్లుగా ఆయన నుండి చూస్తున్నాం. తాజాగా మరోసారి అదే పని చేశారు రాజేంద్ర ప్రసాద్‌. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Rajendra Prasad

‘సఃకుటుంబానాం’ అనే సినిమా ఈవెంట్‌ ఒకటి ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఆ సినిమాలో నటించిన మెయిన్‌ టీమ్‌ అంతా ఆ ఈవెంట్‌కి హాజరైంది. అందులో సీనియర్‌ నటులు రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం కూడా ఉన్నారు. ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. బ్రహ్మానందం మాట్లాడిన తర్వాత నా లాంటి వాళ్లు మాట్లాడటానికి ఏముండదు అని అన్నారు. దానికి పక్కనే ఉన్న బ్రహ్మానందం ఏదో చెబితే.. రిప్లైగా రాజేంద్ర ప్రసాద్‌ ‘ముసలి ముం… కొడకా’ అంటూ ఓ నాటు మాట అనేశారు. ఆ మాటలకు అక్కడున్నవాళ్లంతా నవ్వేసుకున్నారు.

అయితే, ఆ వీడియో సోషల్‌ మీడియాలో వీడియోను షేర్‌ చేస్తూ.. రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజేంద్ర ప్రసాద్‌ మళ్లీ నోరు జారారు అంటూ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో రాజేంద్రుడు గతంలో చేసిన కామెంట్ల గురించి మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి బ్రహ్మానందంతో రాజేంద్రుడికి ఉన్న పరిచయంతో అన్నారు. (ఇది గతంలో రాజేంద్రుడి మాటలు పడ్డ నటులు చెప్పిన మాటే). రెండోది ఆయన అన్నమాటలకు రెండు అర్థాలు ఉన్నాయి.

కొన్ని ప్రాంతాల్లో ఆ పదానికి తల అనే అర్థం కూడా ఉంది. ఓ సినిమాలో బ్రహ్మానందం ‘పెద్ద ముండావాడిని’ అని అంటారు మీకు గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో రాజేంద్రుడు కావాలనే అన్నాడా? లేక వేరే అర్థం అనుకుని అన్నాడా అనేది ఆయనకే తెలియాలి. ఆ విషయం ఇప్పుడు ఆయనే క్లారిటీ ఇవ్వాలి.

చైతన్య ఎలాంటి వాడంటే….? అమల షాకింగ్ కామెంట్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus