‘ఎఫ్ 2’ చిత్రంలో ఇద్దరి పెళ్ళాల మొగుడిలా కనిపించి నవ్వించిన రాజేంద్ర ప్రసాద్.. ‘ఎఫ్3’ మూవీలో నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ నాగరాజు పాత్రలో కనిపించాడు. నిజాయితీ వల్ల అతను సాధించింది ఏమీ లేదని చెప్పి ఇతను చేసిన పనుల వల్ల సినిమా కథంతా మలుపు తిరుగుతుంది. అది ఎలా? ఎందుకు అనేది సినిమాలో చూడాల్సిందే.దర్శకుడు అనిల్ రావిపూడి తన ప్రతీ సినిమాలోనూ అనిల్ రావిపూడికి మంచి పాత్ర ఇస్తుంటాడు.
ఈ సినిమాలో కూడా అలాగే మంచి పాత్ర ఇచ్చాడు. ఇక ఈ చిత్రం సక్సెస్ మీట్లో రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ.. “నా 45 ఏళ్ళ కెరీర్లో నాకు నచ్చిందే చెప్పాను చెబుతూ వస్తున్నాను. ‘ఎఫ్3’ సినిమా చూశాక ఈ సినిమా హిట్ కాకపోతే నా మొహం చూపించనని అన్నాను. అందుకే నేను మాస్క్ వేసుకుని ఇలా వచ్చాను. ఇప్పుడు నిజమైన సక్సెస్ ప్రేక్షకులు ఇచ్చారు.
ఈ సినిమాని ట్రిపుల్ బ్లాక్ బస్టర్ ను చేశారు. సోమవారంనాడు కూడా గుంటూరులో అన్ని ప్రాంతాల్లో హౌస్ ఫుల్ అయ్యాయి అంటే మాములు విషయం కాదు. ఈ సినిమాని రెండు విషయాలు నమ్ముకుని తీశాం. ఒకటి నవ్వు. రెండు ప్రేక్షకులు. 45 ఏళ్ళుగా నేను నవ్వునే నమ్ముకుని సినిమాలు చేస్తున్నాను. అలాగే ఎఫ్2,ఎఫ్3 కూడా చేశాను. ప్రపంచంలోని నలుమూలల నుండీ నాకు ఫోన్లు వస్తున్నాయి. మళ్ళీ మీ రోజులు గుర్తుకువచ్చాయి అంటూ నాతో చాలా మంది అన్నారు.
నాకు మాత్రం `మాయలోడు` సినిమా గుర్తుకొచ్చింది. మనకు పండుగ రోజుల్లో పాత సినిమాలు టీవీల్లో వేస్తుంటారు. గుండమ్మకథ, అప్పుచేసి పప్పుకూడు.. వంటి చిత్రాలు నవ్వులు పూయిస్తుంటాయి. అలా ‘ఎఫ్3’ నవ్వులు పూయించింది” అంటూ చెప్పుకొచ్చారు.
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!