సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకోయల్లోకి వస్తున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పార్టీ పేరు గుర్తుని న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31న ప్రకటించనున్న విషయం తెలిసిందే. ఇక అందుకు సంబంధించిన కొన్ని రూమర్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పార్టీ పేరు ఇదేనంటూ అభిమానులు ప్రచారం చేస్తున్నారు. మక్కల్ సేవై కర్చీ'(ప్రజాసేవ పార్టీ) అనే పేరును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక పార్టీ గుర్తుగా ఆటోను కేంద్ర ఎన్నికల కమిషన్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో బాషా సినిమాలో తలైవా నేను ఆటో వాన్ని అంటూ ఎంతగా హైప్ క్రియేట్ చేశాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ పార్టీకి చీఫ్ కో-ఆర్డినేటర్‌గా అర్జున మూర్తిని, సూపర్ వైజర్‌గా తమిళ్రూవి మణియన్‌ను నియమించిన రజినీకాంత్ ఇప్పటికే అధికారిక వివరణ కూడా ఇచ్చారు. ఇక పార్టీ పేరు గుర్తుపై ఫుల్ క్లారిటీ రావాలి అంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
ఇక రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తే సినీ ప్రముఖులు కూడా ఆయన పార్టీలో చేరుతారనే రూమర్స్ కూడా చాలానే వస్తున్నాయి. ముఖ్యంగా రాఘవ లారెన్స్ కూడా పార్టీలో చేరే అవకాశం లేకపోలేదు. గతంలోనే లారేన్స్ తలైవా రాజకీయాల్లోకి వస్తే తప్పకుండా ఆయనతో కలిసి జనాలకు సేవ చేస్తానని క్లారిటీ ఇచ్చాడు.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!